
మయూరి కాంగో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన “పపా కహ్తే హై” సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే ఆమె అందరినీ ఆకట్టుకుంది. అందం, అమాయకమైన అందచందాలు కలగలిపి అప్పట్లో బాగానే క్రేజ్ తెచ్చుకున్నా.. ఆ క్రేజ్ ఎక్కువకాలం నిలవలేదు. తెలుగులో సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో కలిసి “వంశీ” సినిమాలో హీరోయిన్‌గా నటించింది మయూరి. ఆ సినిమాపై అప్పట్లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో ఆమె టాలీవుడ్‌లో ఎక్కువ అవకాశాలు దక్కించుకోలేకపోయింది. దీంతో తెలుగులో కెరీర్ అక్కడే ఆగిపోయింది.
తర్వాత బాలీవుడ్‌లో “నర్గీస్”, “తోడా ఘం తోడా ఖుషీ”, “డాలర్ బాబు” వంటి సినిమాలు చేసింది. అంతేకాకుండా టెలివిజన్ రంగంలోనూ అడుగుపెట్టి “కిట్టీ పార్టీ” లాంటి షోలలో నటించింది. అయితే ఎక్కువ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోవడంతో, పెద్ద స్టార్‌డమ్ అందుకోలేకపోయింది. చాలా మంది హీరోయిన్స్ సినిమాలకు దూరం అయిన తర్వాత కనుమరుగైపోతారు. కానీ మయూరి మాత్రం చదువులు పూర్తి చేసి, కార్పొరేట్ రంగంలో తన ప్రతిభను చూపించింది. పర్ఫార్మిక్స్ అనే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసింది. అంతేకాదు, 2019లో గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్‌గా చేరి అందరిని ఆశ్చర్యపరిచింది.
చిన్న వయసులోనే గ్లామర్ రంగంలో అడుగుపెట్టి, తక్కువ సినిమాలే చేసినా అభిమానుల మదిలో గుర్తుండిపోయింది మయూరి కాంగో. సినిమాల్లో ఎక్కువ రోజులు నిలవకపోయినా.. కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు గూగుల్‌లో టాప్ పొజిషన్‌లో ఉండటం ఆమె కష్టానికి నిదర్శనం. 13 ఏళ్లకే హీరోయిన్.. 19 ఏళ్లకే గుడ్‌బై.. కానీ ఈ రోజు గూగుల్ టాప్ పొజిషన్‌లో ఉంటూ అందరినీ ఇన్‌స్పైర్ చేస్తోందంటే.. ఇదే మయూరి కాంగో స్పెషల్!