
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “ ఓజి ”. ఈ సినిమా రిలీజ్ కి కేవలం వారం మాత్రమే గడువు ఉంటే ఈ సమయంలో మేకర్స్ ఒకో పాత్రకి సంబంధించిన అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీ పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో నే నిన్న అర్జున్ దాస్ పోస్టర్ ని రిలీజ్ చేస్తే లేటెస్ట్ గా నటుడు ప్రకాష్ రాజ్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. అసలు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉంటాడని ఎవ్వరూ ఊహించనే లేదు.
ఇప్పుడు ఓజీ సినిమాలో ప్రకాష్ రాజ్ సత్య దాదాగా కనిపించనున్నట్టుగా తన పై ఓ కొత్త లుక్ తో రివీల్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తూ ఉంటుంది. ఈ టైంలో ప్రకాష్ రాజ్ పవన్ ఓజీ సినిమా లో కీలక పాత్ర అనగానే అంచనాలు మామూలుగా ఉండవు. మరి ఓజీ సినిమాలో తన రోల్ ఇంకెంత కీలకంగా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు