
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం సుజిత్ పేరు వెనుక కుల ట్యాగ్ పెట్టి, "ఇతడు మా వాడే, మా కులపోడే, మా వాడు హిట్ ఇచ్చాడు" అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ కులపోరాటం స్టార్ట్ అయిపోయింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న సుజిత్ తాజాగా తెరకెక్కించిన సినిమా ఓజి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం — థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక రకంగా చూసాం, కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరో రీతిలో కనబడ్డాడు అని ఫ్యాన్స్ అంటున్నారు.
సినిమా మొత్తం బాగానే ఉంది. కంటెంట్ పెద్దగా లేకపోయినా, పవన్ కళ్యాణ్ తన మేనరిజంతో ముందుకు నెట్టుకొచ్చాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ సినిమాకి మరో హైలైట్. ఇక సుజిత్ డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. అందుకే లోపాలు ఉన్నా కూడా జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే కొందరు పెద్దమనుషులు మాత్రం "సుజిత్ మా కులపోడు, మా వాడు హిట్ ఇచ్చాడు" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమకే ఆనందం క్రియేట్ చేసుకుంటున్నారు. నిజానికి సుజిత్‌కి అలాంటి ట్యాగ్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఆయన తన పేరుకు ఎప్పుడూ ఆ కుల ట్యాగ్ జోడించుకోలేదు.
దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. "అడిగి తన్నించుకోవడం అంటే ఇదే కదా" అంటూ పాత సామెతలను కొత్త స్టైల్లో వైరల్ చేస్తున్నారు. సినిమాను సినిమాగా చూడకుండా రాజకీయ కోణంలోకి లాగి ఎంటర్టైన్‌మెంట్‌ను బ్రష్టు పట్టిస్తున్నారు అంటూ చాలామంది తీవ్రంగా మండిపడుతున్నారు..!