పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజీ . నేడు అనగా సెప్టెంబర్ 25 వ తారీఖున రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది . ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర పాత్రలో నటించాడు . తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఇమ్రాన్, ప్రియాంక మోహన్ మరియు అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రేయ రెడ్డి, శుభలేఖ శంకర్ మరియు తేజ్,   హరీష్ మరియు రాహుల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు . భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . ప్రతి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ అద్భుతంగా ప్లాన్ చేశాడు సుజిత్ .


అదేవిధంగా విలన్ గా నటించిన ఇమ్రాన్ కూడా దుమ్ము రేపాడని చెప్పుకోవచ్చు . ఎంట్రీ నుంచి చివరి నిమిషం వరకు ఇమ్రాన్ ఓమి క్యారెక్టర్ ఫేస్ లో భయం కానీ బెరుకు కానీ లేకుండా యాక్టివ్ గా కనిపించాడు . పవన్ కి దీటుగా క్రూరమైన క్యారెక్టర్ లో తనదైన సత్తా చాటాడు ఇమ్రాన్ . బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదేమో కానీ భలే యాక్టర్ ఇమ్రాన్ హష్మి . ఈ సినిమా దెబ్బకు ఇమ్రాన్ రేంజ్ మారిపోవడం ఖాయమని చెప్పుకోవచ్చు . ఇమ్రాన్ ఎంట్రీ నుంచి ప్రతి సీన్లో తమన్ ఇచ్చే హైట్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పుకోవచ్చు . ఇమ్రాన్ ఎంతటి రొమాంటిక్ వీరుడు ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియనప్పటికీ లాగా అంటూ ఒకప్పటి కుర్రాళ్లను ఉర్దూగలించాడు .


ఈయన సినిమాల కంటే సాంగ్స్ తెలుగు ఆడియన్స్ను బాగా కనెక్ట్ చేశాయి . ఇమ్రాన్ కెరీర్ స్టార్టింగ్ లో బోల్డ్ సీన్లు మరియు రొమాంటిక్ సన్నివేశాలతో  ఫేమస్ అయ్యాడు . 2004లో విజయ్ బట్ డైరెక్షన్ లో వచ్చిన మర్డర్ మూవీ అతని కెరీర్ నే మార్చేసిందని చెప్పుకోవచ్చు . ఈ మూవీ థియేటర్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది . అనంతరం నుంచి యూత్ ఐకానిక్ అండ్ డెత్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఇమ్రాన్ . ప్రజెంట్ ఇమ్రాన్ గురించి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: