- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

OG చాలా సింపుల్ కథ. నిజం చెప్పాలంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సాహో సినిమాను కాస్త మార్చి మళ్లీ దానికి మాఫియా బ్యాక్ డ్రాప్ పెట్టి తీశాడు సుజిత్. కాకపోతే సాహోలో చేసిన తప్పులు ఇందులో చేయలేదు. చూడడానికి చాలా రొటీన్ కథలాగా అనిపిస్తుంది కానీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు సుజిత్. పవన్ కళ్యాణ్ చుట్టూ కథ అల్లుకున్నాడు. ఆయన ఆరా ఈ సినిమా కథను నడిపించింది. గంభీరమైన లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు పుట్టించాడు. మధ్య మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కూడా పెట్టాడు. ప్రియాంక మోహన్‌తో ఎమోషనల్ బ్యాక్‌స్టోరీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామాను ఎమోషనల్ గా తెరకెక్కించాడు. క్రమం తప్పకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హై ఇచ్చాడు అది కూడా మాములు హై కాదు సుజిత్ రాసుకున్న సీన్లకు అదేదో డ్రగ్ తీసుకున్నట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాడు తమన్.


ఫస్టాఫ్ అయితే ప్యూర్ మెంటల్ మాస్ పూనకాలు వచ్చేసాయి ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్ట్స్‌ లెవెల్. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కు నిదర్శనం. అక్కడక్కడ కాస్త స్లో అయింది కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సుజీత్ రాసుకున్న ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ మీద ఆయనకున్న ప్రేమ కనిపించింది. తన అభిమాన హీరోని ఎలా చూపించాలి అనుకున్నాడో అంతకంటే 100 రెట్లు బాగా చూపించాడు. ఒక రొటీన్ రెగ్యులర్ కథను పవన్ కళ్యాణ్ ని అనే పేరు చుట్టూ తిప్పేసాడు. ఒక్కటైతే నిజం.. ఇన్నేళ్ళ కెరీర్ లో పవర్ స్టార్ ను ఇంత పవర్ ఫుల్ గా ఎవరు చూపించలేదు. అందుకే ఫ్యాన్స్‌కు కూడా సినిమా పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: