తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబం ఒక ప్రత్యేక బ్రాండ్‌గా నిలిచింది. సినీనటుడు, నిర్మాత, గిన్నిస్ రికార్డ్ హోల్డర్ అయిన దగ్గుబాటి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక లెజెండరీ బ్యానర్. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సురేష్ బాబు నిర్మాతగా, వెంకటేష్ హీరోగా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మూడో తరం హీరోలలో రానా దగ్గుబాటి ప్రస్తుతం హీరోగా, విలన్‌గా, నిర్మాతగా విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. దగ్గుబాటి కుటుంబంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న హీరోలు వెంకటేష్, రానాలే. వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా వరుస హిట్స్ ఇస్తూ ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మరోవైపు రానా మాత్రం కృష్ణం వందే జగద్గురుమ్ నుంచి బాహుబలి, గాజీ, రానా నాయుడు వరకు విభిన్నమైన పాత్రల్లో మెప్పించాడు.


ఇక ఈ ఇద్దరు అబ్బాయి-బాబాయిలతోనూ రొమాన్స్ చేసిన హీరోయిన్ అంటే లేడీ సూపర్‌స్టార్ నయనతార అనే చెప్పుకోవాలి. వెంకటేష్-నయనతార కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ హిట్. వీరి జంటగా వచ్చిన లక్ష్మి, తులసి చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన బాబు బంగారం మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో నయనతార రానాతో కలిసి కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో జోడీ కట్టింది. ఈ సినిమా నయనతార కెరీర్‌లో స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. నయనతారతోపాటు బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా కూడా దగ్గుబాటి హీరోలిద్దరితోనూ రొమాన్స్ చేసింది. వెంకటేష్ నటించిన సుభాష్ చంద్రబోస్ సినిమాలో, రానా నటించిన నా ఇష్టం సినిమాలో జెనీలియా కథానాయికగా మెరిసింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించకపోయినా, జెనీలియా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.



అలా దగ్గుబాటి అబ్బాయి, బాబాయిలిద్దరితోనూ స్క్రీన్‌పై రొమాన్స్ చేసిన హీరోయిన్లలో నయనతార, జెనీలియా ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే లేడీ సూపర్‌స్టార్ అనే బ్రాండ్‌తో, ఇప్పటికీ టాప్ స్థాయిలో కొనసాగుతున్న నయనతార దగ్గుబాటి హీరోలిద్దరితోనూ నటించి, ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. మరోవైపు జెనీలియా మాత్రం ప్రస్తుతం సహాయ పాత్రలతో సినిమాల్లో కనిపిస్తోంది. ఇటీవల ఆమె నటించిన జూనియర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడింది. మొత్తానికి, దగ్గుబాటి అబ్బాయి-బాబాయిలిద్దరితోనూ స్క్రీన్ రొమాన్స్ చేసి, ప్రేక్షకులను అలరించిన హీరోయిన్లలో నయనతార, జెనీలియా పేర్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: