మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో హిట్లర్ సినిమా ఒక కీలక మలుపు. ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమాలు ఆయన ఇమేజ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అలాంటి కాలంలోనే ఆయనతో కలిసి నటించిన హీరోయిన్ అంజలా ఝవేరి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే పేరు. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ చూడాలని ఉంది సినిమాలో సౌందర్యతో పాటు అంజలా ఝవేరి కూడా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ అప్పట్లో మంచి హిట్ అవ్వడమే కాకుండా, సంగీతం పరంగానూ పెద్ద విజయం సాధించింది. ఆ సినిమా ద్వారా అంజలా ఝ‌వేరి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.


ఇక అంజలా ఝవేరి సినీ ప్రయాణం చూసుకుంటే.. అందం, అభినయం కలబోసుకున్న అద్భుతమైన నటి. తక్కువ సినిమాలు చేసినప్పటికీ తనదైన క్రేజ్ సంపాదించుకుంది. విక్టరీ వెంకటేష్ సరసన ప్రేమించుకుందాం రా సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కింగ్ నాగార్జునతో రావోయి చందమామలో కనిపించింది. అలానే బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుని పాపులారిటీ సంపాదించింది. అయితే, టాప్ రేంజ్‌లోకి వెళ్లే సమయంలోనే అంజలా ఝవేరి ఫామ్ తగ్గిపోయింది. కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రావడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాల్సి వచ్చింది. చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల రూపొందించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కూడా కనిపించింది.



అంజలా ఝవేరి వ్యక్తిగత జీవితాన్ని చూస్తే.. అది కూడా ఒక ఆసక్తికరమైన ఎపిసోడ్. చిరంజీవి సినిమాల్లో విలన్‌గా నటించిన నటుడు తరుణ్ అరోరాను ఆమె వివాహం చేసుకుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, తరుణ్ అరోరా చిరంజీవి ఖైదీ నంబర్ 150లో ప్రధాన ప్రతినాయకుడిగా నటించాడు. తరువాత భోళా శంకర్లోనూ కనిపించాడు. ప్రస్తుతం ఆయన తెలుగులో పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.వివాహం తర్వాత అంజలా ఝవేరి సినిమాలకు పూర్తిగా దూరమై, కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసిన హీరోయిన్, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌కి దూరంగా ఉన్నా.. ఆమె చేసిన సినిమాలు, పాత్రలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.


https://www.instagram.com/reel/DCaqo3MIfy_/?utm_source=ig_web_copy_link


మరింత సమాచారం తెలుసుకోండి: