టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “ మన శంకర వరప్రసాద్ గారు ” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా లో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కూడా మ‌రో ప‌వ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన లేడీ అమితాబ‌చ్చ‌న్‌ నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. గ‌తంలో న‌య‌న‌తార చిరు కాంబినేష‌న్ లో సైరా న‌ర‌సింహారెడ్డి - గాడ్ ఫాద‌ర్ సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి వీరి కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్కుతోంది.


పైగా శ‌శిరేఖ అనే అంద‌మైన పేరుతో ఈ సినిమాలో న‌య‌న‌తార న‌టిస్తుండ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు. లేటెస్ట్ గా అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్ రివీల్ చేశారు. న‌య‌న‌తార పాత్ర ప‌రిచ‌యం చేస్తూ అనిల్ ఓ పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌దిలారు. న‌య‌న‌తార‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. త‌న పాత్ర‌తో సినిమాకు మ‌రింత అందం ఆమె తెచ్చార‌ని అనిల్ రావిపూడి కితాబు ఇచ్చారు.


ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా వేసిన ఓ సెట్‌లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాతో ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్ర‌క‌టించారు. అక్టోబర్‌ 5 నుంచి వెంకటేశ్ ఈ షూటింగ్‌లో భాగం కానున్నారు. సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: