కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు పొందిన అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు 60కు పైగా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అభిమానుల కోసం ఎలాంటి రిస్కీ పాత్రలోనైనా సరే నటిస్తూ ఉంటారు అజిత్. చివరిగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే తరచూ ఎక్కువగా కార్ రేసింగ్ లో పాల్గొంటూ ఉంటారు. దీంతో ఈమధ్య సినిమాలలో చాలా తక్కువగా నటిస్తున్నారు. అటు తమిళ్ ,తెలుగులోనే కాకుండా వివిధ భాషలలో కూడా అజిత్ ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు.


చిన్న వయసు నుంచే చదువు మీద ఆసక్తి లేకపోవడంతో పదవ తరగతి వరకు మాత్రమే చదివి ఆ తర్వాత బైక్ మెకానిక్ గా పని చేశారు. చదువు రాకపోయినా కూడా అజిత్ కి ఎన్నో రకాల భాషలను అనర్గళంగా మాట్లాడతారు. రేసింగ్ ఇష్టముండడంతో కొన్ని వేల కిలోమీటర్లు వేకేషన్స్ అంటూ బైకు మీద వెళ్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉండగా హీరో అజిత్ ఒక వింతైన వ్యాధితో బాధపడుతున్నట్లు వినిపిస్తున్నాయి. అజిత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఈ విషయాన్ని పంచుకున్నారట. కార్ రేసింగ్ , సినిమాలలో బిజీగా ఉండడం వల్ల కుటుంబ బాధ్యతలు సరిగ్గా చూసుకోలేకపోయానని, తన  బాధ్యతలను తన భార్య షాలిని తీసుకున్నదని.. ఆమె లేకపోతే తన జీవితంలో ఇదంతా సాధ్యమయ్యేది కాదంటూ తెలిపారు.


ఇటీవల కాలంలో తాను నిద్రపోవడం కూడా చాలా కష్టంగా మారింది అంటూ తెలిపారు. తాను కేవలం రోజులో నాలుగు గంటల మాత్రమే నిద్రపోతానని చాలా కాలంగా నిద్రలేని సమస్యతో ఇబ్బంది పడుతున్నానంటూ తెలియజేశారు. ఇందుకు సంబంధించి విషయం తెలియడంతో అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఆరోగ్యం జాగ్రత్త అంటూ సలహా ఇస్తున్నారు. తన తదుపరి సినిమాల కథల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ నందుకు వెళుతున్నారు అజిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: