
సురేందర్ రెడ్డి సినిమాలు స్టైలిష్ మరియు యాక్షన్ అదే విధంగా గ్రాండ్ సెట్స్ మరియు హీరోల సరికొత్త లుక్ లో చూపించడంలో ముందు ఉంటాయని మనందరికీ తెలిసిందే . ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ మళ్లీ పట్టా లేకపోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రాజదంతున సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసి కొత్త ప్రాజెక్టుకి డేట్స్ కొనసాగించనున్నట్లు తెలుస్తుంది .
ఓజీ వంటి బ్లాక్ బస్టర్ అనంతరం ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలగనున్న పవన్ తన తదుపరి డేట్స్ సురేందర్ రెడ్డి కి కేటాయిస్తారా అనే విషయంలో ఆసక్తి కొనసాగుతుంది . మరి ఇదే కనుక నిజం అయితే ఈ కొత్త ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ తన స్టైలిష్ లుక్ మరియు యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాడని చెప్పుకోవచ్చు . మరి అభిమానులు ఎదురుచూస్తున్నా ఈ కాంబినేషన్ నెరవేరుతుందో లేదో చూడాలి . ఇదే కనుక నెరవేరితే పవన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు . ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .