బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, తెలుగు స్టార్ ఎన్టీఆర్ జూనియర్ కలిసి నటించిన భారీ స్థాయి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల‌లో ఒకటి. ‘వార్’ ఫ్రాంచైజీకి ఇది రెండో భాగం. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నా, థియేటర్లలో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయి కలెక్షన్లు సాధించలేకపోయింది. అయితే బాక్సాఫీస్ వద్ద కొంత నిరాశ కలిగించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన అందుకుంటోంది. తాజాగా ఆర్మాక్స్ రిపోర్ట్ ప్రకారం, అక్టోబర్ 6 నుండి 12 వరకు భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన సినిమాగా ‘వార్ 2’ నిలిచింది. మొత్తం 3.5 మిలియన్ వ్యూస్ సాధించి, నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్ స్థానం దక్కించుకుంది.


అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ తన ప్రత్యేక యాక్షన్ స్టైల్‌తో ఆకట్టుకోగా, ఎన్టీఆర్ మాస్ ఎనర్జీతో స్క్రీన్‌ను హీటప్ చేశాడు. ఈ ఇద్దరి క్లాష్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ కియారా అద్వాని తన గ్లామర్‌తో పాటు కీలక పాత్రలో మెరిసింది. అలాగే అనిల్ కపూర్, అశుతోష్ రాణా వంటి సీనియర్ నటులు కథకు బలాన్ని చేకూర్చారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం, స్పై యూనివర్స్‌లో మరో ఆసక్తికరమైన చాప్టర్‌గా నిలిచింది.


యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, మరియు హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ విలువలతో సినిమా ప్రదర్శన అద్భుతంగా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. థియేటర్లలో మిశ్రమ ఫలితం వచ్చినా, ఓటిటీలో ‘వార్ 2’ భారీ విజయాన్ని నమోదు చేస్తూ, హృతిక్–ఎన్టీఆర్ కాంబినేషన్‌కి ప్రేక్షకులు గట్టి మద్దతు ఇస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: