ప్రస్తుతమున్న టెక్నాలజీ పరంగా చాలామంది ఏఐను ఉపయోగిస్తున్నారు. దీని ఆదరణ కూడా రోజు రోజుకి పెరుగుతోంది. మార్కెట్లో పెరిగిన పోటీ నేపథ్యంలో చాట్ జిపిటి సరికొత్త ఫీచర్ ని ఇప్పుడు తీసుకువచ్చే పనిలో పడినట్లు కనిపిస్తోంది. డిసెంబర్ నుంచి వయసు నిర్ధారణ పూర్తి చేసినటువంటి పెద్దలకు మాత్రమే చాట్ జిపిటిలో ఒక ప్రత్యేకించి మ్యాచ్యూర్ కంటెంట్ కనిపిస్తుంది అంటూ సీఈఓ శ్యామ్ అల్టిమేన్ ఈ విషయాన్ని తెలియజేశారు. పెద్దలను పెద్దలుగా చూస్తూ వారికి కావలసిన కంటెంట్ యాక్సెస్ చేసుకోవడమే వీటి యొక్క ఉద్దేశం అంటూ తెలిపారు.


 ఏఐ మొదట చాట్ జిపిటి లో చాలా కఠినమైన నియంత్రణలు పెట్టింది. ఇందుకు గల కారణం ఏమిటంటే మానసిక ఒత్తిడి , డిప్రెషన్ లో ఉన్న యూజర్స్ తప్పుగా ప్రభావితం చేయకుండా చూడడమే.. కానీ ఈ నియంత్రణ వలన మానసికంగా ఆరోగ్యంగా ఉన్న యూజర్స్ చాట్ జిపిటిని పెద్దగా ఆసక్తి చూపించలేదట. అందుకే రాబోయే రోజుల్లో చాట్ జిపిటి పెద్ద అప్డేట్ తో రాబోతోందని తెలిపింది. దీనివల్ల చాట్ జిపిటి ప్రవర్తనను కూడా మార్చుకోగలరని, ఎమోజీలు ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు, స్నేహితుడులా కూడా వ్యవహరించేలా చూసుకోవచ్చు, స్నేహపూర్వకంగా కూడా చాట్ చేసుకొనే సదుపాయంతో సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు.


ఇక ఈ ఏడాది డిసెంబర్ నుంచి చాట్ జిపిటి లో వయసు నిర్ధారిత యూజర్స్ సైతం  మ్యాచ్యూర్ కంటెంట్ యాక్సెస్ లభిస్తుందని తెలియజేశారు. ఇందులో ఎరోటికా వంటి కంటెంట్ ఉంటుంది. ఇది సాధారణ యూజర్లకు అందుబాటులో ఉండదు. మానసిక ఆరోగ్య విషయం పైన కూడా ఏఐ కొత్త సాంకేతిక సాధనలను భద్రత వ్యవస్థలను కూడా అభివృద్ధి చేస్తోంది కనుక దీంతో సేఫ్గా నియంత్రణలను తగ్గించడం సాధ్యమవుతుందంటూ వెల్లడించారు అల్టిమన్. దీన్ని బట్టి చూస్తే ఓపెన్ ఏఐ, చాట్ జీపిటి ఇప్పుడు బాధ్యతతో అలాగే సహజంగా స్పందించే విధంగా  రూపురేఖలను మార్చబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: