భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోకెల్లా తమిళనాడు రాష్ట్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఒక పార్టీ అధికారంలోకి ఒక ఎలక్షన్స్  టైమ్ లో వచ్చిందంటే మరో ఎలక్షన్స్ లో వేరే పార్టీ అధికారంలోకి రావాల్సిందే. ఒక్క జయలలితకు తప్ప మిగిలిన ఏ పార్టీ కూడా రెండు సార్లు అక్కడ అధికారంలోకి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపించవు.ఒకవేళ వచ్చినా కొద్దిపాటి సీట్ల తేడాతో తప్ప పూర్తి మెజారిటీతో అయితే అధికారంలోకి రాదు. అయితే తాజాగా తమిళనాడులో మరో కొత్త విషయం వైరల్ అవుతుంది. అదేంటంటే..గత కొద్ది రోజుల నుండి తమిళనాడులో హిందీ భాష వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.హిందీ భాషను బ్యాన్ చేయాలని,హిందీ సినిమాలను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అధినేత సీఎం అయినటువంటి స్టాలిన్ అసెంబ్లీలో కొత్త బిల్లు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటి నుండి హిందీ సినిమాలను ఇక్కడ బ్యాన్ చేయాలి అని తమిళనాడు ప్రభుత్వం కొత్త బిల్లు అసెంబ్లీ లో ప్రవేశపెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే తమిళ భాష సినిమాలు కూడా ఇతర ఇండస్ట్రీలో బ్యాన్ అవుతాయి. రజినీకాంత్,విజయ్ లాంటి హీరోల సినిమాలకు షాక్ తగులుతుంది.దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజాగా తమిళనాడులో హిందీ సినిమాలను బ్యాన్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై తమిళనాడు ప్రభుత్వం కొట్టి పారేసిందని,హిందీ సినిమాలను బ్యాన్ చేస్తున్నట్టు ఎక్కడా కూడా ప్రస్తావించలేదని,అలాగే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. 

దంతులు వ్యాప్తి చేయవద్దని తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి చెప్పినట్టు తమిళనాడు ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది.అయితే హిందీ భాషను,హిందీ పేరులో ఉన్న హోర్డింగ్ లను, హిందీ సినిమాలను బ్యాన్ చేయాలి అని తమిళనాడు ప్రభుత్వం ఆలోచన చేసిందట. కానీ దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో నిపుణుల సలహాలు తీసుకొని సీఎం వెనక్కి తగినట్టు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ తమిళనాడులో ఇలాంటి భాషా వివాదం తలెత్తితే మాత్రం దేశంలో తమిళనాడు పై వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: