తెలుగు సినీ పరిశ్రమ లో సూపర్ క్రే జ్ కలిగిన నటలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు . ఈయ న ఆఖరు గా మంచి విజయం అందుకుని చాలా కాలమే అవుతుంది . రవితేజ ఆఖరుగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమా కా అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. శ్రీ లీలా ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తర్వాత రవితేజ చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ రవితేజ కు ఏ సినిమా ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు.

ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలోనూ , అలాగే కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీలోనూ హీరో గా నటిస్తున్నాడు. మాస్ జాతర మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపాందుతున్న సినిమా తర్వాత శివ నిర్వన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివ నిర్వణ దర్శకత్వంలో నటించడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా చాలా మంది రవితేజ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తే బాగుంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. శివ దర్శకత్వంలో చేయబోయే  సినిమాలో రవితేజ తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ సినిమా గనుక మంచి విజయం సాధించినట్లయితే రవితేజ ఆ తర్వాత కూడా తన వయసుకు తగ్గ పాత్రలలో నటించే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt