సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు గుర్తొచ్చే ఒక విషయం ఏమిటంటే — ఎప్పటికప్పుడు కొత్త జంటలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ప్రతి తరం, ప్రతి దశలో ప్రేక్షకులు కొత్త హీరో–హీరోయిన్ల కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి కొత్త జంటల జాబితాలో తాజాగా చర్చనీయాంశంగా మారినది ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య జంట. ఇక కొంత కాలం వెనక్కి వెళితే, సోషల్ మీడియాలో రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ పేర్లు ఎలా దుమ్ము రేపాయో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్, కెమిస్ట్రీ గురించి ప్రతి వారం ఏదో ఒక రకమైన వార్త వస్తూనే ఉండేది. టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్, మలయాళం, తమిళం — మొత్తం నేషనల్ లెవెల్‌లో కూడా ఈ జంట పేర్లు ట్రెండ్ అయ్యాయి.రష్మిక మందన్నా  పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె చేసే ప్రతి చిన్న పని కూడా నేషనల్ మీడియాలో పెద్ద వార్తగా మారిపోతుంది. మరి విజయ్ దేవరకొండ కూడా “అర్జున్ రెడ్డి” సినిమా తర్వాత స్టార్‌డమ్ ను ఆకాశానికెత్తేశాడు. వీరిద్దరూ కలసి ఎక్కడైనా కనిపిస్తే చాలు, మీడియా వాళ్లు, ఫ్యాన్స్ మొత్తం సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ చేయడం మొదలుపెడతారు.

ఇటీవల వీళ్లిద్దరూ నిశ్చితార్ధం చేసుకున్నారు అంటూ వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వారం రోజులపాటు నేషనల్ మీడియా వీళ్ళ గురించి ఫుల్ కవరేజ్ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. “రష్మిక–విజయ్” గురించి మాట్లాడటం ఆగకముందే, ఇప్పుడు అందరి దృష్టి మరో కొత్త జంటపై నిలిచిపోయింది — అదే ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య జంట.“బేబీ” సినిమా ద్వారా ఈ ఇద్దరి కెమిస్ట్రీను ప్రేక్షకులు గట్టిగా ఫీల్ చేశారు. సినిమాలో చూపిన ప్రేమ, భావోద్వేగం స్క్రీన్ మీద మాత్రమే కాకుండా, ఆఫ్ స్క్రీన్ లో కూడా నిజమవుతున్నట్టు ఫీలవుతున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు, ఫ్యాన్ ఎడిట్స్, రీల్స్ గాలిలో ఎగురుతున్నాయి.

ప్రస్తుతం ఆనంద్–వైష్ణవి జంటను “క్యూట్ కపుల్ ఆఫ్ టాలీవుడ్” అని పిలుస్తున్నారు. రష్మిక–విజయ్ పెళ్లి అయిన తర్వాత ఈ జంటే ఇండస్ట్రీలో తర్వాతి “టాక్ ఆఫ్ ది టౌన్” అవుతారేమో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నెటిజన్లు సరదాగా “రష్మికకు ఇప్పుడు తోడుకోడలు దొరికిపోయింది, అదే వైష్ణవి చైతన్య!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా ఒక్కసారిగా ఫోకస్ రష్మిక–విజయ్ దేవరకొండ నుంచి వారి కుటుంబం లోని తమ్ముడు ఆనంద్ దేవరకొండ వైపుకు మళ్లిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట ఫొటోలు, రీల్స్, ఫ్యాన్ మీమ్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి.ఇండస్ట్రీలోని అనేక మంది కూడా ఈ కొత్త జంట గురించి మంచి మాటలే చెబుతున్నారు. “ఆనంద్ దేవరకొండకి ఉన్న న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్స్, వైష్ణవి చైతన్యకి ఉన్న ఇన్నసెన్స్ – ఈ ఇద్దరి కలయిక చాలా ఫ్రెష్‌గా, రియలిస్టిక్‌గా ఫీలవుతుంది” అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి, ఇప్పుడు టాలీవుడ్ సోషల్ మీడియాలో “రష్మిక–విజయ్” కన్నా ఎక్కువగా “ఆనంద్–వైష్ణవి” జంట పేర్లే మారుమ్రోగిపోతున్నాయి. ఈ జంట నిజంగానే ఒకరినొకరు లైఫ్ పార్ట్‌నర్స్‌గా ఎంచుకుంటారా లేదా అన్నది కాలమే చెప్పాలి కానీ, అభిమానులు మాత్రం ఇప్పటినుంచే వీరిని “నెక్ట్స్ లవ్‌బర్డ్స్ ఆఫ్ టాలీవుడ్” అని పిలుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: