
ఆ ఆడియోలో మంత్రి నారాయణ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు వినిపిస్తున్నాయి. ఆడియో కాల్ లో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ను జీరో చేశామంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఇదంతా కూడా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే వర్మను జీరో చేసామంటూ ఆయన క్లారిటీతోనే తెలియజేసినట్లు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, వర్మ కు ఏదో ఒక రోజు గొడవ జరుగుతుందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
పిఠాపురంలో వర్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాలని సీఎం చంద్రబాబు స్వయంగానే వార్నింగ్ ఇచ్చారంటూ మంత్రి నారాయణ ఆడియోలో వెల్లడించారు. ఒకవేళ జనసేన పార్టీ వాళ్లు వర్మను పిలిస్తే వెళ్లి మాట్లాడాలని లేకపోతే సైలెంట్ గా ఉండాలంటూ ఒక వార్నింగ్ ఇచ్చారని మంత్రి నారాయణ మాట్లాడారు. ఇక పార్టీ ఇంటర్నల్ విషయాలపైన ఏమీ మాట్లాడకూడదని ఎవరైనా లైన్ దాటి మాట్లాడితే వ్యవహారం మరొక లాగా ఉంటుందంటు మంత్రి నారాయణ నెల్లూరులో జరిగిన టెలి కాన్ఫరెన్స్లో వెల్లడించారు. అందుకు సంబంధించిన ఒక ఆడియో లీక్ కూడా ఇప్పుడు రాజకీయాలలో వైరల్ గా మారింది.