దీపావళి పండుగ కానుకగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండగా మొదట మిత్రమండలి మూవీ విడుదలైంది. మిత్రమండలి సినిమాకు సంబంధించి ఎంపిక చేసిన థియేటర్లలో ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రియదర్శి, విష్ణు ఓయ్, రాగ్ మయూర్ , ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో నిహారిక ఎన్.ఎం హీరోయిన్ గా నటించారు. బన్నీ వాష్ సమర్పించడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. జాతిరత్నాలు, లిటిల్ హార్ట్స్ తరహాలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిందా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.

కథ :

నారాయణ (వీటీవీ  గణేష్) కు కులపిచ్చి ఎక్కువ.  జంగ్లీపట్నం ప్రాంతంలో నివశించే నారాయణ  కులం విషయంలో పట్టింపులకు పోతే  ఎంత దూరమైనా పోతాడు.  కులాంతర వివాహాలు సైతం నారాయణకు నచ్చవు. ఎమ్మెల్యే కావాలని భావించే నారాయణ తన కులం సపోర్ట్ తోనే  తాను  ఎమ్మెల్యే కావాలని అనుకుంటాడు.  ప్రముఖ పొలిటికల్ పార్టీ నారాయణకు టికెట్ ఇవ్వడానికి సిద్దమవుతున్న తరుణంలో నారాయణ కూతురు స్వేచ్చ  ఇంటినుంచి పారిపోతుంది.

కూతురు పారిపోయిందని తెలిస్తే  పరువు పోతుందని భావించి నారాయణ   కూతురు  కిడ్నాప్ అయిందని ఫిర్యాదు చేస్తాడు.  ఎస్సై సాగర్ (వెన్నెల కిషోర్)  స్వేచ్ఛ పారిపోవడం వెనుక నలుగురు కుర్రాళ్ళ హస్తం ఉందని భావించి  వాళ్ళను విచారిస్తాడు. ఆ తర్వాత కథలో చోటు చేసుకున్న మలుపులు ఏమిటి?  చివరకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే మిత్రమండలి.


విశ్లేషణ :

ఈ  మధ్య కాలంలో   జాతిరత్నాలు, లిటిల్ హార్ట్స్ సినిమాలు చిన్న సినిమాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం  చేసుకున్నాయి.   కామెడీ అద్భుతంగా ఉంటే  కథ లేకపోయినా సినిమాలు హిట్ అవుతాయని ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి.  అయితే మిత్ర మండలి మూవీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసే విషయంలో ఫెయిలైంది. హిట్ సినిమాకు అవసరమైన సెటప్ ఉన్నా  కొన్ని సీన్లు మినహా సినిమా ప్రేక్షకులను మెప్పించేలా లేదు.

కామెడీలో ఎంతో   అనుభవం ఉన్న నటులు తెరపై  కనిపిస్తున్నా డైలాగ్స్ లో  పస  లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది.  ప్రియదర్శి, విష్ణు ఓ.ఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా మంచి కామెడీ టైమింగ్  ఉన్న నటులు  అయినప్పటికీ వాళ్ళను సరైన  విధంగా యూజ్ చేసుకోవడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు.  టెక్నీకల్ గా ఈ సినిమా ఓకే అయినా  అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో మాత్రం ఫెయిల్  అయిందని చెప్పాలి.  డైరెక్టర్ విజయేందర్ ఈ సినిమాకు సంబంధించి తనదైన ముద్ర వేసే  విషయంలో ఫెయిల్ అయ్యారు .

ప్లస్ పాయింట్స్ :

సెకండాఫ్ లోని కొన్ని సీన్స్

సత్య కామెడీ టైమింగ్

మైనస్ పాయింట్స్ :

కథ

కామెడీ

రేటింగ్ : 2.5 / 5.0

 


మరింత సమాచారం తెలుసుకోండి: