
సాధారణంగా ఇండస్ట్రీ వర్గాల లెక్కల ప్రకారం, ఆనంద్ దేవరకొండ స్థాయి హీరోల సినిమాలు 10 నుండి 12 కోట్ల మధ్యలో పూర్తవుతాయని భావన ఉంది. అయితే ఇప్పుడు బడ్జెట్‌లు రెండు రెట్లు పెరిగాయి. అంతేకాకుండా ఆనంద్ రెమ్యునరేషన్ కూడా నాలుగు కోట్ల వరకు చేరిందని టాక్. ఇది అతని మార్కెట్ స్థాయి ఎలా పెరుగుతోందో చూపిస్తోంది.ప్రస్తుతం ఆనంద్ చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి. “బేబీ” సినిమా విజయంతో అతనికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ హిట్ పూర్తిగా సోలో క్రెడిట్ కాదని, నిర్మాత ఎస్‌కేఎన్, డైరెక్టర్ సాయి రేజేష్, కంటెంట్ ఈ మూడు కలిసే ఆ సినిమాను భారీ హిట్ చేశాయన్నదే టాలీవుడ్లో వినిపించే మాట.
అందుకే బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఆ క్రెడిట్ ఆనంద్ దేవరకొండ ఖాతాలో పూర్తిగా పడలేదు. సోలో హీరోగా అతడి మార్కెట్ ఆ రేంజ్‌లో పెరగలేదని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. ఆ తర్వాత “ జై గణేశా ” మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు 25 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న సినిమా ఫలితం కీలకం కానుంది. మార్కెట్ స్థాయికి తగ్గట్టుగా రికవరీ సాధ్యమవుతుందా అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో బాగా నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఆనంద్ కెరీర్ మరింత స్థిరపడే అవకాశం ఉంది. సినిమా ఫల్టీ కొడితే ఆనంద్ దేవరకొండ తో తర్వాత సినిమాలు చేసేందుకు టాలీవుడ్ లో చాలా మంది అంత ఆసక్తి చూపే ఛాన్సులు అయితే లేవు.