సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న స్టార్ సెలబ్రిటీ కపుల్ ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే బయటకి రావడం, ఫ్యాన్ తో ముచ్చటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ముచ్చటించే వీడియోను అక్కడే ఉన్న ఒకరు రికార్డ్ చేయడంతో, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. “ఇంత సింపుల్‌గా, ఇంత ఫ్రెండ్లీగా ఉంటే ఇష్టపడకుండా ఉండలేం” అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. అయితే ఆ వీడియోలో కనిపించిన వారు ఎవరో తెలుసా? వాళ్లు మరెవరో కాదు — టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్య, ఆయన భార్య, టాలెంటెడ్ హీరోయిన్ శోభితా దూళిపాళ.

నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాగచైతన్య, తన కృషితో స్టార్ హీరోగా స్థిరపడ్డాడు. ఇటీవలే విడుదలైన ఆయన తాజా చిత్రం "తండేల్"తో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల క్లబ్‌లో చేరి భారీ విజయం సాధించింది. ప్రస్తుతం చైతన్య తన కెరీర్‌లో కొత్త దశను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాగ చైతన్యకు కార్లంటే ప్రత్యేకమైన ఇష్టం ఉందన్న విషయం ఫ్యాన్స్‌కు తెలిసిందే. హైదరాబాదులో తరచూ తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంటాడు. రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఆయన వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. దీపావళి సందర్భంగా చైతన్య తన భార్య శోభితాతో కలిసి సెలబ్రేషన్ ఫోటోలు షేర్ చేయగా, ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇదే సమయంలో, ఇప్పుడు మరోసారి ఈ జంట వీడియో వైరల్ అవుతోంది. హైదరాబాదు వీధుల్లో కారులో ప్రయాణిస్తుండగా, వీరిద్దరినీ గుర్తించిన ఓ మహిళ ఆశ్చర్యపడి అలా చూస్తూ ఉండిపోతుంది.  వెంటనే కారు ఆపి చైతన్య ఆమెతో మాట్లాడారు. నాగ చైతన్య కూడా చాలా వినయంగా ఆ మహిళతో కాసేపు ముచ్చటించడం ఆ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. సమంతతో విడాకుల తర్వాత, నాగ చైతన్య జీవితంలో శోభితా దూళిపాళ ప్రవేశించడం పెద్ద చర్చగా మారింది. మొదట ఈ జంట గురించి వచ్చిన వార్తలను ఎవ్వరూ నమ్మకపోయినా, కాలక్రమేణా వారి బాండింగ్ స్పష్టమవడంతో అభిమానులు కూడా వీరిని జంటగా అంగీకరించారు. ఇప్పుడు వీరిద్దరూ ఎక్కడ కనిపించినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే మారుతున్నారు.



ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో నాగ చైతన్య – శోభితా దూళిపాళ సింపుల్ స్టైల్‌లో, హాయిగా కారు డ్రైవ్ చేస్తూ కనిపించడం అభిమానుల మనసులు దోచేస్తోంది. "స్టార్స్ అయినా ఇంత సింపుల్‌గా ఉండగలరా?" అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా ప్రతి సారి నాగ చైతన్య, శోభితా దూళిపాళ కలిసి కనిపించినప్పుడు, వారి కెమిస్ట్రీ, సింప్లిసిటీ సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించడం కొత్తేమీ కాదు. ఈసారి కూడా అదే జరిగింది — ఈ వీడియో ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.






https://www.instagram.com/reel/DQEkN-xDwmm/?utm_source=ig_web_copy_link

మరింత సమాచారం తెలుసుకోండి: