
ఇక తాజాగా ఆమె నటించిన సినిమా "తెలుసు కదా" ..నీరజ్ కోనా దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాశి ఖన్నా ఇంకో హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చిన ఈ మూవీలో శ్రీనిధి నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ డెప్త్ అన్నీ కలిపి సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. ఈ సినిమా సక్సెస్ తర్వాత, టాలీవుడ్‌లోని పలువురు టాప్ మేకర్స్ ఆమె వైపు దృష్టి మళ్లించారని సమాచారం. తాజాగా, నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ సినిమా కోసం శ్రీనిధి శెట్టిని ఫైనల్ చేశారట. మొదట ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నప్పటికీ, షెడ్యూల్ కారణాలతో అది సాధ్యం కాలేదట. దీంతో మేకర్స్ శ్రీనిధిని సంప్రదించగా, ఆమె కథ విన్న వెంటనే ఓకే చెప్పిందట.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమా ఓజీ యూనివర్స్ లో భాగాంగా సాగే హ్యూమన్ డ్రామా అని, శ్రీనిధి పాత్ర చాలా స్ట్రాంగ్‌గా, డిఫరెంట్ షేడ్స్‌తో ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఈ మూవీ ఆమె కెరీర్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందన్న అంచనాలు మొదలయ్యాయి.ఇప్పటికే సోషల్ మీడియాలో “శ్రీనిధి శెట్టి బిగ్ జాక్‌పాట్ కొట్టేసింది!”, “100 నక్క తోకలు తొక్కినట్టే – ఇక బ్లాక్‌బస్టర్ రేంజ్ రోల్ దొరికింది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి, కేజీఎఫ్ తర్వాత మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న శ్రీనిధికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే, శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లో టాప్ లీగ్‌లో స్థానం పక్కాగా దక్కించుకుంటుంది.