చిరంజీవి - అనిల్ రావిపూడి  సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ బాబీ కొల్లీ తో మరో భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కాంబినేషన్‌కి సంబంధించిన ఎగ్జైట్మెంట్ అంచనాలకు అందడం లేదు. ఎందుకంటే చిరంజీవిబాబీ కాంబోలో ఇప్పటికే వచ్చిన “వాల్తేరు వీరయ్య” ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే — “వాల్తేరు వీరయ్య తర్వాత బాబీచిరంజీవి సినిమా అంటే పక్కా సెన్సేషన్” అని ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ కొత్త సినిమా కోసం ప్రీ–ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.


 స్క్రిప్ట్ లాక్ అయిందని, టైటిల్ కూడా సెట్ అవుతోందని టాక్. బాబీ ఈ సినిమాను మాస్, ఎమోషన్, కామెడీ కలయికగా రూపొందించాలనే ప్లాన్‌లో ఉన్నారట. “వాల్తేరు వీరయ్య”లో చిరంజీవి చూపించిన టైమింగ్, స్టైల్, పంచ్ డైలాగ్స్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారని బాబీ బృందం చెబుతోంది. ఇదిలా ఉండగా, బాబీ దర్శకుడిగా చూపిస్తున్న గ్రోత్‌ కూడా గమనార్హం. ఆయన మొదట్లో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నా, ఇప్పుడు పెద్ద హీరోలతో భారీ సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు. చిరంజీవి వంటి లెజెండ్‌తో వరుసగా రెండోసారి పని చేసే అవకాశం రావడం ఆయనకు కూడా గౌరవంగా భావిస్తున్నారు. బాబీ చెప్పినట్టుగా — “చిరంజీవి గారు వర్క్ చేస్తున్నప్పుడు ఎనర్జీని చూసి ఆశ్చర్యపోతాం. ఆయన డెడికేషన్, టైమింగ్, ప్యాషన్ ఇవన్నీ ఇంత వయసులో కూడా తగ్గలేదనే అనిపిస్తుంది” అని అన్నారు.



మరోవైపు చిరంజీవి కూడా బాబీని ప్రశంసిస్తూ, “ఇతనిలో ఉన్న క్రియేటివ్ మైండ్ చాలా స్పెషల్‌. ఏ సీన్‌లోనైనా కొత్తదనం తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. వర్క్ పట్ల ప్రేమ, సినిమాపట్ల అంకితభావం చూసి సంతోషంగా ఉంటుంది” అని అన్నారు.ఇప్పటికే ఫ్యాన్స్ మధ్య ఈ కాంబినేషన్ చర్చ టాప్‌లో ఉంది. నిజానికి ఈ సినిమా 2027 లో రిలీజ్ అవుతుంది అనుకున్నారు ఫ్యాన్స్. కానీ 2026 డిసెంబరు లోనే ఈ సినిమా రిలీజ్ చేసే విధంగా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇది అభిమానులకి బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పలి. సోషల్ మీడియాలో “వాల్తేరు వీరయ్య 2 వస్తుందా?” అని మీమ్స్, పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. ఈ కాంబో సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.మొత్తానికి, మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ చివరి దశలో ఉన్నా, తన ప్రతి మూవీలో కొత్తదనం చూపిస్తూ, సినిమాపై ప్రేమతో ముందుకు సాగుతున్నారు.  బాబీతో రాబోయే సినిమా  సెన్సేషన్ సృష్టించబోతోందని క్లియర్‌గా కనిపిస్తోంది. చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ పండగే జరుగుతుంది — కాబట్టి ఈ  సినిమా కూడా మెగా ఫ్యాన్స్‌కి నిజంగానే ఒక డబుల్ ఫెస్టివల్ అవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: