సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటులు బాగోతాలు అప్పుడప్పుడు బయటపడితే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటివరకు మంచి వాళ్ళగా నటించి ఒక్కసారిగా వారి నిజస్వరూపాలు బయటపడే సరికి ఇన్ని రోజులు మనం ఒక అబద్ధాన్ని నమ్మామా అని అనిపిస్తుంది.అయితే తాజాగా ఒక నటి నటుడిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి.అయితే రీసెంట్గా ఆ నటుడు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు వచ్చిన వీడియోలు ఫేక్ అని,అవి ఏఐ క్రియేటెడ్ ఇమేజెస్ అని కొట్టి పారేశారు.కానీ అవి ఏఐ కాదు నిజాలే అని, అజ్మల్ ఎంతోమంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు అంటూ ఒక నటి సంచలన కామెంట్లు చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్వీని అజ్మల్ అనే నటుడి పై చేసిన కామెంట్లు వైరల్ వైరల్ అవుతున్నాయి. నర్విని దేరి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అజ్మల్ దుర్మార్గుడు.. 

నేను అతన్ని 2018 లో కలిసాను.నా ఫ్రెండ్ ద్వారా అతను నటుడు అని తెలిసింది.ఆ సమయంలో నన్ను చూసి మా సినిమా కోసం ఆడిషన్ కి రమ్మని చెప్పాడు.కానీ నాకు అప్పటికే డెన్మార్క్ వెళ్లాల్సి ఉండగా అది క్యాన్సల్ చేసుకొని మరీ రమ్మన్నాడు. ఆ తర్వాత అజ్మల్ చెప్పిన హోటల్ కి వెళ్ళగా అక్కడ ఎవరూ లేరు.డౌట్ వచ్చి నా ఫ్రెండ్ కి మెసేజ్ పెట్టి 20 నిమిషాల తర్వాత నా నుండి ఎలాంటి ఫోన్ మెసేజ్ రాకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేయ్ అని చెప్పాను. ఆ తర్వాత అజ్మల్ ని చూస్తే కాస్త తేడాగా అనిపించింది.ఇక ఆయన ప్రవర్తన చూసి వాష్ రూమ్ కి వెళ్లి కొద్దిసేపు అక్కడే గడిపాను. ఆ తర్వాత బయటికి రావడంతో అజ్మల్ నా చేయి పట్టుకుని డాన్స్ చేయమని ఒత్తిడి చేశాడు.నీ ఇంటెన్షన్ ఏంటో అర్థమైంది.నేను ఇక్కడి  నుండి వెళ్తున్నాను.నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పినా కూడా అజ్మల్ వదిలిపెట్టలేదు. ఆ తర్వాత నన్ను గట్టిగా హత్తుకునే ప్రయత్నం చేశాడు.

అంతేకాదు నన్నేమైనా చేయాలి అంటే నన్ను చంపాకే చేస్కో అని వార్నింగ్ ఇచ్చా.  అలాగే నా సిస్టర్స్ కిందే ఉన్నారని, నేను ఇప్పుడు వెళ్లకపోతే వాళ్లు ఇక్కడికి వెతుక్కుంటూ వస్తారని చెప్పాను. అదే సమయంలో రూమ్ బాయ్ కాలింగ్ బెల్ కొట్టడంతో అజ్మల్ డోర్ తెరవడంతోనే నేను అక్కడి నుండి పారిపోయాను. ఇక ఆ సమయంలో నేను నా స్టడీస్ మీద దృష్టి పెట్టడం వల్ల పోలీస్ కేసు లాంటిది ఏమీ పెట్టలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది తమిళ్ నటి నర్విని. ప్రస్తుతం అజ్మల్ పై నర్వి చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో దుమారం సృష్టిస్తున్నాయి. ఇక అజ్మల్ అమీర్ తెలుగులో కూడా పలు సినిమాలు చేశారు.రామ్ చరణ్ హీరోగా వచ్చిన రచ్చ సినిమాలో నటించారు. అలాగే జీవా నటించిన రంగం మూవీ లో కూడా చేశారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే మూవీ చేశారు. అలా తెలుగు తమిళ భాషల్లో నటుడిగా రాణిస్తున్న అజ్మల్ అమీర్ పై నటి నర్విని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: