గత కొద్ది రోజులుగా మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ మధ్య విభేదాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య సఖ్యత లేదని, పెళ్లయ్యాక రకుల్ కి మంచు లక్ష్మికి మధ్య గొడవలు వచ్చి వీరి మధ్య ఉన్న స్నేహం చెడిపోయింది అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియా లో రూమర్స్ వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది మంచు లక్ష్మి. పెళ్లి కి ముందు రకుల్ ప్రీత్ సింగ్ నాతో చాలా బాగా ఉండేది.కానీ ప్రస్తుతం రకుల్ కి ఏం చెప్పినా సరే తన భర్తకి చెప్పే చేయాలంటోది. ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదైనా ప్లాన్ చేసినా కూడా ఆ ఓకే అని నా ముందు చెప్పినప్పటికీ ఆ తర్వాత కొద్దిసేపటికి జాకీ ని అడిగాక అసలు విషయం చెబుతాను అంటూ తప్పించుకుంటుంది. 

అలా ఎటైనా వెళ్దామన్నా కూడా జాకీ పర్మిషన్ లేకుండా రకుల్ ఎక్కడికి రావడం లేదు. అయితే పెళ్లయిన కొత్తలో అందరూ ఇలాగే ఉంటారు.అఫ్ కోర్స్ నేను కూడా అలాగే ఉన్నాను.కానీ ఇంకొద్ది రోజులు చూస్తాను.మరో సంవత్సరం వెయిట్ చేశాక కూడా ఇలాగే ఉంటే అప్పుడు రకుల్ సంగతి చెప్తాను.ఆమెకి కచ్చితంగా స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇస్తాను. ఇంకా వెయిట్ చేయడం నావల్ల కాదు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది మంచు లక్ష్మి.అయితే గతంలో మంచు లక్ష్మి,రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు కొంతమంది కలిసి ఒక గ్యాంగ్ ఉండేది.

ఈ గ్యాంగ్ ఎక్కడికి వెళ్లినా కూడా జంటగా కనిపించేవారు.అలా ఎన్నో వెకేషన్ లకు కలిసి వెళ్లి చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. కానీ ఎప్పుడైతే రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బాగ్నానీని పెళ్లి చేసుకుందో అప్పటినుండి ఎక్కువగా ఈ గ్యాంగ్ తో కలవడం లేదట. సినిమాలు ఫ్యామిలీ ఇవే రెండు చూసుకుంటుందట. బయటికి ఫ్రెండ్స్ తో వెళ్దాం అన్నా కూడా టైం ఇవ్వడం లేదట.అందుకే మంచు లక్ష్మి ఇలా అసహనంతో ఆ ఇంటర్వ్యూలో రకుల్ గురించి మాట్లాడినట్టు అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: