ఈ మద్య కొద్దికాలంగా హాలీవుడ్ మొదలు టాలీవుడ్ వరకు 'క్యాస్టింగ్-కౌచ్' గురించి అంతులేనంత చర్చ జరుగుతూనే ఉంది. ఈ చర్చ మరీ రొటీన్ గా మారిపోయింది. హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్-స్టీన్ చాలామంది హీరోయిన్లను మహిళలను సినిమా అవ కాశాలను ఆశచూపి వాటికోసం అల్లల్లాడే మహిళలను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో అతడిని పోలీ సులు అరెస్టు చేశారు. సినిమా అవకాశాల సాకుతో లైంగిక వేధింపులకు పాల్పడే దర్శకనిర్మాతలకంటే, చాన్స్ కోసం అదే లైంగికతను పణంగా పెట్టే నటీనటులు ఇండస్ట్రీలో బోలెడుమంది ఉన్నారని ఫైర్‌బ్రాండ్ ఏక్తా కపూర్ తెలిపారు.

Harvey Weinsteins exist on the other side of the story too: Ekta Kapoor
దీంతో
ప్రపంచ వ్యాప్తంగా సినీరంగంలో-ఆఫీసుల్లో-పని చేసే ప్రదేశాల్లో
లైంగిక వేధింపులకు గురైన మహిళలందరూ ధైర్యంగా బయటపడుతూ "మీటూ హాష్ ట్యాగ్"
తో సోషల్ మీడియాలో ఓ ఉద్యమం నడిపారు.

బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా పలువురు ఈ క్యాస్టింగ్-కౌచ్ పై మాట్లాడారు. తాజాగా ఈ వ్యవహారం పై ఇండియన్ టెలివిజన్ సినిమా నిర్మాత బాలాజి టెలిఫిలింస్ అధినేత ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశాల కోసం కొందరు తమంతట తామే లైంగిక కోరికలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారని తమను తాము సమర్పించుకోటానికి సిద్ధంగా ఉంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్ నిర్వహించిన ఒక షోలో ఏక్తా కపూర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటి వరకు కొందరు హీరోయిన్లు తప్పని సరి పరిస్థితులలో, బలవంతంగా క్యాస్టింగ్-కౌచ్ బారిన పడ్డామని చెప్పిన ఘటనలు విన్నాం. క్యాస్టింగ్-కౌచ్ లో దాదాపుగా దర్శక నిర్మాతలనే విలన్ లుగా చిత్రీకరించేవారు. అయితే అవకాశాల కోసం వారి లైంగిక కామ వాంఛను తీర్చేందకు సిద్ధపడే నటీనటులు పరిశ్రమలో బోలెడు మంది ఉన్నారని ఏక్తా కపూర్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. బలమైనవారిని, శాసించేస్థితిలో ఉన్నవారినే దోషులుగా చిత్రీకరించడం తగదని అన్నారు.

డబ్బు, హోదా , అధికారం లేవు కాబట్టి వారినే బాధితులుగా పరిగణించ కూడదని అన్నారు. బాలీవుడ్ లో చాలా మంది హార్వీ వీన్-స్టీన్ లు ఉన్నారని, తమ ఇష్టానుసారం గానే అవకాశాల కోసం శృంగారం అందించిన నటీమణుల సంఖ్య తక్కువేమీ కాదన్నారు. అవకాశం కోసం వారు అర్రులు చాచి చేసింది తప్పు కాకపోవచ్చని, కానీ వివాదం వచ్చినప్పుడు అవతలివారినే దోషులనడాన్ని మాత్రం తాను సమర్థించనన్నారు ఏక్తా కపూర్.

"చాన్స్ కోసం రాత్రి 2 గంటల సమయంలో ఓ నిర్మాత దగ్గరికి ఓ నటి వెళ్లిందనుకుందాం. ఆ తర్వాత తన సినిమాలో ఆమెకు సరిపోయే పాత్ర లేకపోవడంతో ఆమెకు అవకాశం ఇవ్వలేదనుకుందాం. అప్పుడు ఇందులో తప్పు ఎవరిది అందాం? పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను వేరుగా చూస్తాడు కాబట్టి అతనా నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఉదాహరణలో ఎవరు బాధితులు? శక్తిమంతులే అడ్వాంటేజ్ తీసుకుంటారని అనడం సరికాదు" అని ఏక్తా కపూర్ ఘాటుగా స్పందించారు.

తమ అవసరాలకు పూర్తిగా లొంగిపోయి శృంగారంలో పాల్గొని అవకాశాలు దక్కించుకొని పైకెదిగి "ఏరుదాటాక బోడిమల్లన్న" అన్న సామెతను ఋజువుచేసే ఈ కుహనా పతివ్రతా నటీమణులకు ఏక్తా ఘట్టి స్ట్రోకే ఇచ్చారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి