రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన పోస్టర్ ను ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోనే సెకండ్ షెడ్యూల్ జరుగుతున్నది. ఈ షెడ్యూల్ తరువాత అహ్మదాబాద్ లో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఇప్పటికే లాక్ చేసినట్టు సమాచారం. స్వతంత్ర దినోత్సవం రోజున ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే, ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అనే దానిపై అందరి చూపులు ఉన్నాయి. ఎవరిమటుకు వాళ్ళు విజువల్ వండర్ గా ఉండే ఫోటోను రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారు. ఆరోజు హీరోలతో కూడిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా లేదంటే టైటిల్ లుక్ ను రిలీజ్ చేస్తారా అన్నది తెలియాలి.
అల్లూరి సీతారామ రాజు, కొమరం భీంల పాత్రల ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు అలియా భట్, నిత్యా మీనన్, సాయి పల్లవి తదితరులు నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడి ఎవరు అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉన్నది.