తెలుగునాట అగ్రదర్శకులలో ఒకడిగా ఉన్న పూరి..టాప్ హీరోలు పవన్, మహేష్, ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగార్జున అందరికీ హిట్ లు ఇచ్చిన పూరి.. తక్కువ కాలంలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించి నేటి దర్శకులలో మేటి అనిపించుకున్న పూరి.. తెలుగు సినిమా చరిత్రలో రికార్డుల మోత మోగించిన పూరి.. ఇపుడు హిట్ సినిమా కోసం పరితపిస్తున్నాడు.. సొంత బ్యానర్లో ఛార్మి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా ఇస్మార్ట్ శంకర్ సినిమా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు... రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పైనే పూరి ఆశలు పెట్టుకున్నాడు.. ఈ నెలలో రిలీజు కాబోతున్న ఈసినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది...
ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు, ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రామ్ తొలిసారి పూర్తిస్థాయి తెలంగాణ కుర్రాడి పాత్రలో నటించడంతో సినిమాపై ఆసక్తి మరింత ఎక్కువైంది. రామ్ హైపర్ పెర్ఫార్మెన్స్, పూరీ మార్క్ డైలాగులు, హీరోయిన్ల అందచందాలు వెండితెరపై ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు. వీటికి తోడు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మాస్ ఆడియన్స్‌ను మెప్పించే మంచి పాటలు అందించారు. ఇక ఆయన ఇచ్చే నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’కు సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై హీరో రామ్ కూడా స్పందించారు. శంకర్ ‘ఎ’ ఫిక్షనల్ క్యారెక్టర్‌గా మాత్రమే ప్రేక్షకులు చూడాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. ‘ఇస్మార్ట్ శంకర్’లో చూపించిన మద్యపానం, ధూమపానం నిజజీవితంలో ఆరోగ్యానికి ఎంతో హానికరమని దాని జోలికి వెళ్లకండి అంటూ సలహా ఇచ్చారు.