సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ సరసన గ్లామరస్ ఎమ్మెల్యేగా ఆకట్టుకున్న బ్యూటీ కేథరిన్ ట్రెసా. ఈమె టాలీవుడ్లో చాలా సినిమాలే చేసినా ఆశించనంతగా గుర్తింపు మాత్రం పొందలేకపోయింది. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌లో మాత్రం ఇంట్రస్టింగ్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఆకట్టుకుంటోంది. ఇకపోతే తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టే కేథరిన్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ బాధాకరమైన విషయాన్ని వెల్లడించింది. అదేమంటే ఈ భామ ఓ వింత జబ్బుతో బాధపడుతోందట.
తనకు ఈ సమస్య చాలా కాలంగా ఉన్న ఎవరితో షేర్ చేసుకోలేదని వెల్లడించింది. అంతేకాదు తనకున్న వింత జబ్బు కారణంగా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో అసలు పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించుకుందట ఈ గ్లామర్ బ్యూటీ.. ఇక మంచి ఫాంలో ఉన్న తమ అభిమాన కథానాయిక ఇలాంటి వింత సమస్య ఎదుర్కొంటుదని తెలిసిన అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..ఇకపోతే లక్ష మందిలో ఒక్కరి మాత్రమే వచ్చే ఆ వింత జబ్బు ఏంటంటే.. కేథరిన్ వాసనలు తెలుసుకోలేదట. అది సువాసన అయినా చెడ్డ వాసన అయినా కేథరిన్‌కు మాత్రం ఎలాంటి అనుభూతిని కలిగించదట.
ఇది అత్యంత అరుదైన వ్యాది అని ఈ జబ్బును అనోస్మియా అంటారని, లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్య ఎదురవుతుందని తెలిపింది కేథరిన్. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతన్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ ఏడాది ఈ అమ్మడు నటించిన మూడు తమిళ చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా మరికొన్ని సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయట. ఇక ఈ వింత జబ్బు వల్ల ఒక్కోసారి అమోఘమైన సువాసనలను మిస్స్ అవుతున్నానని, నాకు ఇష్టమైన ఆహరపదార్ధాల వాసనను రుచిద్వార ఆస్వాధిస్తున్నానని తెలిపారు...