ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని విరమించుకునే పరిస్థితి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే ఉక్రెయిన్  పై  రష్యా యుద్ధం ప్రారంభించి దాదాపు పది రోజులు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ ఎక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. రష్యా బీకర రీతిలోనే అటు ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది. జనావాసాల పై కూడా బాంబు దాడులకు పాల్పడుతూ నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇలా ఉక్రెయిన్ పై భీకర స్థాయిలో బాంబుల వర్షం కురిపిస్తుంది రష్యా.


 ఈ రెండు దేశాల మధ్య పలుమార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ ఎక్కడ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఇక ఈ శాంతి చర్చలు  కాస్త విఫలం గానే ముగిసాయ్. ఇలాంటి సమయంలోనే ఉక్రెయిన్ కు అండగా ఉంటానంటూ హామీ  ఇచ్చిన యూరోపియన్ యూనియన్ నాటో అమెరికా లాంటి దేశాలు ప్రస్తుతం రష్యాపై కఠినతరమైన ఆంక్షల పర్వం కొనసాగిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆర్థికపరమైన సాంకేతిక పరమైన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇలా ఒక వైపు ఉక్రెయిన్ ఆయుధాలతో యుద్ధం చేస్తూ ఉంటే ఇక ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికాలో లాంటి పాశ్చాత్య దేశాలు రష్యా పై ఆర్థిక యుద్ధం చేస్తున్నాయి.



 అయితే ఇక ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ రష్యా తీరులో మార్పు రావడంలేదు. ఇలాంటి నేపథ్యంలో మరోసారి మరిన్ని ఆంక్షలు విధించడానికి సిద్ధమైంది అమెరికా. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ దిగుమతులపై కూడా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అధికారికంగా ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్ మిత్రదేశాలు ఇక ఈ అంశాల విషయంలో తమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేవు అని చెప్పుకొచ్చారు. అయితే మిత్ర దేశాల పరిస్థితిని అర్థం చేసుకోగలమని...ఉక్రెయిన్ కు అండగా ఉంటూ నిధులు అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.  ఇక ముడి చమురు దిగుమతుల పై నిషేధం  ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లడం ఖాయం అంటూ బైడెన్ చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: