ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ప్రస్తుతం తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణంలో యుద్ధం మొదలవుతుందో తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే సిరియాలో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ మెరుపు దాడులకు పాల్పడింది. ఈ క్రమంలోనే పరిస్థితులు ఒక్కసారిగా ఉధృతంగా మారిపోయాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ హమాస్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.



 ఇక హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్ చేస్తున్న మెరుపు దాడుల్లో ఎంతో మంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి.  ఇక ఇప్పుడు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం పై కూడా ఇజ్రాయిల్ దాడికి పాల్పడిన నేపథ్యంలో.. ఇది మరింత సంచలనంగా మారిపోయింది. అయితే తాము ఇజ్రాయిల్ పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు రహీం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏ రాత్రి అయినా తాము దాడి చేయొచ్చు అంటూ సంచలన ప్రకటన చేశారు.


 తమ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ ఇజ్రాయిల్ కు హెచ్చరికలు కూడా జారీ చేశారు రహీం. మేమేంఎప్పుడు దాడి చేస్తాము ఇజ్రాయిల్ కు అస్సలు తెలీదు. ఎక్కడ నుంచి ఎక్కడికి దాడి చేస్తామో కూడా తెలియక.  ఇజ్రాయిల్ బిక్కు బిక్కుమంటుంది. నిజమైన యుద్ధం కంటే ఈ మానసిక రాజకీయ యుద్ధమే ఇజ్రాయిల్ ను మరింత ఎక్కువగా భయపెడుతుంది అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు రహీం చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఇక ఏ క్షణంలో ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడి చేస్తుందో అన్నది తెలియని విధంగా మారిపోయింది. మరోవైపు తమ దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించే ఇజ్రాయిల్ ఇక ఇరాన్ ను ఎలా ఎదురు దెబ్బ కొడుతుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: