తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవ నినాదంతో వెలుగులోకి వచ్చిన పార్టీ. తెలుగు వారి ఆత్మ గౌరవమే తన ధ్యేయమని చెప్పిన పార్టీ. ఆ పార్టీ నాయకులు కూడా ఎన్నడూ ఇన్ని కన్ ఫ్యూజ్ స్టేట్మెంట్లు ఇవ్వనే ఇవ్వలేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా అధినేత చంద్రబా బును నమ్ముకున్నా కూడా వాళ్లు ఏనాడు ఇన్ని గందరగోళం మాటలు చెప్పలేదు. ఎందుకనో పవన్ వీరిని మించిపోతున్నారు. కుల రహిత రాజకీయం అంటూనే, సామాజిక న్యాయం అంటూనే కొత్త సూత్రాలనేవో ఆయన వల్లెవేస్తున్నారు. అసలు ఆయన చంద్రబాబును అధికారంలోకి తేవాలన్న ధ్యేయంతోనే పనిచేస్తున్నారా అన్నది ఓ సంశయం.




అదే ఆయన ఆశయం అయితే అప్పుడు ఇంకొంత స్పష్టంగా చెప్పి, ఇతర సామాజిక వర్గాలను తిట్టడం మానుకోవాలి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గంకు చెందిన పారిశ్రామిక వేత్తలనూ ఆయన టార్గెట్ చేయడం అన్నది తగని పని. నేను మీ విషయమై కూడా ఆలోచించాల్సి వస్తుంది..అని చెప్పడం ఇంకా తప్పు. ఎందుకంటే వాళ్లంతా అన్నయ్య చిరు మనుషులు. ఎన్నో ఏళ్ల నుంచి వారి వారి కుటుంబాలు చిరుతో సంబంధ బాంధవ్యాలు నడుపుతున్నాయి. అలాంటిది చిరును టార్గెట్ చేసి, ఆయన మనుషులనూ టార్గెట్ చేసి పవన్  సాధించేది ఏంటన్నది అస్సలు అర్థం కాని విషయమై  ఉంది. మెగా కుటుంబం అంతా ఒక్కటే అన్నప్పుడు మరి! ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ అలానే ఉన్నప్పుడు చిరు మనుషులను ఎందుకు కొత్తగా పవన్ తన ప్రసంగాల్లో టార్గెట్ చేస్తున్నారని? ఇది కూడా అంతుపోలని విషయమే!




క్షణక్షణంకూ మారిపోయే  రాజకీయంలో పవన్ కు మాత్రం గేమ్ ఆడడం రావడం లేదు అన్న విమర్శ ఒకటి తరుచూ వినిపిస్తోంది.వర్గ శత్రువు కమ్మ సామాజిక వర్గం అని తేల్చాక, ఇక యుద్ధం అన్నది రెడ్డి సామాజిక వర్గంపై అని స్పష్టం అయిపోయింది. పోనీ అలా చూసుకున్నా పవన్ రెడ్ల ఓట్లను కాదనుకుంటున్నారా? అలా చూసుకుంటే జగన్ సామాజికవర్గంకు చెందిన మనుషులు జనసేనలో లేరా? లేదా వాళ్ల ఓట్లు అవసరం లేదనా? అధికారం దక్కించుకోవడం అన్నది ప్రథమావధి అని భావించినప్పుడు, అన్ని  సామాజికవర్గాలనూ కలుపుకుని పోవాలి. వర్గ శత్రువు ఆకలి, పేదరికం అని కమ్యూనిస్టు పదాలు వాడి, వాటి వేడి పెంచి,మళ్లీ అదే ప్రసంగంలో ఓ ప్రధాన అగ్ర వర్ణాన్ని ఎలా కించపరుస్తారో అన్నది పవన్ కే తెలియాలి. ఒక వర్గాన్ని ఒక వర్ణాన్ని కించ పరి చి మాట్లాడడంతో పవన్ సాధించేది ఏమీ ఉండదు. అన్ని వర్గాలూ, వర్ణాలూ కలిసి ఉంటేనే సమాజం. కలిసి, కలిపి ఓటేస్తేనే గెలుపు.నాకు కులం కాదు ముఖ్యం గుణం అని చెబుతూనే వైసీపీ పెద్దలను సామాజికవర్గం పేరు పెట్టి మరీ! ఎందుకు తిడుతున్నారని? ఆయనెందుకు మళ్లీ మళ్లీ చంద్రబాబును నమ్ముకుంటున్నారని? ఇవే ఇప్పుడు తేలని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

ap