కొడాలి నాని 2004 ఎన్నికల ముందు వరకు ఆ పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు అన్న ఒకే ఒక్క కారణంతో చంద్రబాబు అప్పటి గుడివాడ టిడిపి ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కాదని... మరి కొడాలి నానికి 2004 లో గుడివాడ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కొడాలి నాని పై గుడివాడ ప్రజల్లో అప్పుడు ఉన్న క్రేజ్ తో పాటు ... జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రచారం నేపథ్యంలో నాని తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో మరోసారి గుడివాడ టిడిపి టిక్కెట్ కోసం గట్టి పోటీ ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసమే కొడాలి నానికి చంద్రబాబు మరోసారి టిక్కెట్‌ ఇచ్చారు.

ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్న‌ నానిపార్టీ నుంచి 2014 - 2019 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం తో పాటు ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. కొడాలి నాని టిడిపి ని ... చంద్రబాబును , బాబు తనయుడు లోకేష్ ను ఎలా ? టార్గెట్ చేస్తూ వస్తున్నారో.. చూస్తూనే ఉన్నాం. చివ‌ర‌కు నాని బూతులు ఎంత‌లా హైలెట్ అవుతున్నాయో ?  చెప్ప‌క్క‌ర్లేదు. నాని మాట‌లు పార్టీ శ్రేణుల్లో ఆత్మ‌స్థైర్యాన్ని కూడా ఒక్కోసారి దెబ్బ తీస్తున్నాయి.

ఇక వ‌చ్చే ఎన్నిక‌లలో నానిని ఎలాగైనా ఓడించాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు మాత్ర‌మే కాకుండా.. తెలంగాణ లో టీడీపీ అభిమానుల‌తో పాటు ఇత‌ర పార్టీల‌కు చెందిన వారు కూడా కోరుకుంటున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ నానిని ఓడించాలంటే ఖ‌చ్చితంగా నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఎవ‌రో ఒక‌రిని గుడివాడ‌లో పోటీ చేయించాల‌ని కొంద‌రు కోరుతున్నారు. నందమూరి ఫ్యాక్ట‌ర్ ఇక్కడ బలంగా పని చేస్తే కొడాలి నాని ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాద‌ని అంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు నిర్ణ‌యం ఎలా ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: