ఇండియాలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ జనాభా కూడా పెరుగుతూ పోతున్నారు. కానీ ఇలా అపరిమితంగా జనాభా పెరగడం అన్న విషయం ఎన్ని సమస్యలకు దారి తీస్తుంది అన్న విషయం గురించి ఆలోచిస్తేనే చాలా భయం కలుగుతుంది. అయితే దీని కోసం భారత ప్రభుత్వ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా జనాభా నియంత్రణ స్కీమ్స్ ను తీసుకువస్తున్న ఏదీ కూడా వర్క్ అవుట్ కావడం లేదు. అయితే జనాభా పెరుగుతుంది అని ఇంతగా బాధపడడానికి ప్రధాన కారణం మనకు అవసరం అయిన వనరులు తక్కువగా ఉండడమే. ఇదే విషయంపై ఇటీవల నమోదు అయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై సుప్రీం కోర్ట్ విచారణ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఫిల్ లో జనాభాను తగ్గించడానికి అవసరమా అయిన నియమ నిబంధనలను తీసుకురావడానికి సుప్రీమ్ కోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలని సూచించారు. ఐతే దీనిపై సుప్రీం కోర్ట్ తగిన విచారణ జరిపి ఒక నోటీసును కేంద్రానికి పంపింది. దీనిపై తగు వివరణను ధర్మాసనం కోరింది. కాగా మనకు ఉన్న వనరుల సంగతి అలా ఉంచితే... ముఖ్యంగా మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ప్రస్తుతం ఉన్న జనాభాకు అర్హతకు తగిన ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అలాంటిది ఇక సంవత్సరం సంవత్సరానికి జనాభా పెరుగుతూ పోతే కొన్ని ఏళ్ళ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది. పెరిగిన జనాభాకు వనరులు మరియు ఉద్యోగాల సరిపోతాయా అన్నది భారత్ లోని మేధావుల మదిలో మెదులుతున్న ప్రశ్న ? మరి దీనికి సమాధానంగా ఇప్పటి నుండే ప్రతి ఒక్కరూ జనాభా నియంత్రణ పట్ల అవగాహన కలిగి ఉండాలి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం మన దేశంలో ఒక రోజుకి ఎంతమంది జన్మిస్తున్నారో మీకు తెలుసా ? అమెరికాలో అయితే రోజుకు 30,000 మంది జన్మిస్తుంటే , మన దేశంలో మాత్రం రోజుకు 70,000మంది పురుడు పోసుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: