జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మిత్రపక్షం బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఊహించని షాకిచ్చారు. బీజేపీ నుండి ఈ స్ధాయిలో షాక్ తగులుతుందని పవన్ ఏమాత్రం ఊహించుండరు. ఇంతకీ విషయం ఏమిటంటే వీర్రాజు మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో జనంతోనే తమకు పొత్తుంటుంది..వస్తే జనసేనతో కూడా ఉంటుందన్నారు. జనంతోనే తమకు పొత్తని ప్రతి పార్టీ చెప్పేదే కాబట్టి ఇందులో కొత్తదనం ఏమీలేదు. ఇదే సమయంలో వస్తే జనసేనతో కూడా పొత్తుంటుంది అనటంలో అర్ధమేంటి ?






తమనుండి విడిపోయి తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్న విషయం బీజేపీ గమనిస్తునే ఉంది. నిజానికి పేరుకు మాత్రమే ఈ రెండుపార్టీలు మిత్రపక్షాలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండుపార్టీలు కలిసి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదు. పైగా తాము మిత్రపక్షాలే అని రెండుపార్టీల నేతలు ప్రకటనలైతే చేస్తారు కానీ కలిసి వెళ్ళింది ఎప్పుడూ లేదు. బీజేపీతో పొత్తంటూనే ఈమధ్యనే జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో చాలాచోట్ల పవన్ టీడీపీ తో పొత్తుపెట్టుకుని పోటీచేసిన విషయం అందరికీ తెలిసిందే.






బీజేపీతో పొత్తుండగా బీజేపీ బద్ధశతృవుగా భావిస్తున్న టీడీపీతో పొత్తు ఎలాగ పెట్టుకుంటారని అడిగితే పవన్ నోరిప్పరు. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు కూడా మాట్లాడరు. వీళ్ళిద్దరి పొత్తు ఇంత దివ్యంగా సాగుతోంది కాబట్టే ఏరోజైనా రెండుపార్టీలు విడిపోయేవే అని అందరు అనుకుంటున్నారు.





ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ కేమో జగన్మోహన్ రెడ్డి మెయిన్ టార్గెట్ అయితే బీజేపీకేమో చంద్రబాబు ప్రధానమైన టార్గెట్.  మొన్ననే బహిరంగసభలో పవన్ మాట్లాడుతు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించినా బీజేపీ నేతలు ఏమీ మాట్లాడలేకపోయారు. అలాంటిది హఠాత్తుగా వస్తే జనసేనతోనే ఎన్నికలకు వెళతామని లేకపోతే ఒంటరిగానే ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది. అంటే పరోక్షంగా జనసేన తమను వదిలేసినా ఇబ్బందిలేదని చెప్పటమే. తమతో కలిసుండాలో కూడదో పవనే డిసైడ్ చేసుకోవాలని హెచ్చరికే కనబడుతోంది. మరి వీర్రాజు హెచ్చరికపై పవన్ ఏ విధంగ స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: