తెలుగుదేశంపార్టీ ఆశలు వదిలేసుకున్నట్లే అనుమానంగా ఉంది. అందుకనే రాబోయే తెలంగాణా ఎన్నికల్లో ఒంటరిపోరుకు డిసైడ్ అయ్యింది. హైదరాబాద్ ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో మొత్తం 119 నియోజకవర్గాల్లోను తెలుగుదేశంపార్టీ పోటీచేయాలని తీర్మానం చేసింది. అన్నీ నియోజకవర్గాల్లోను పోటీచేయాలని తీర్మానం చేయటమంటే ఎవరితోను పొత్తులు ఉండదనే కదా అర్ధం. మొన్నటివరకు బీజేపీతో పొత్తుకోసం బాగా ప్రయత్నించింది. అలాంటిది ఒంటరిపోరుకు తీర్మానం చేసిందంటే పొత్తు కుదరదని అర్ధమైపోయినట్లుంది.





ఇక్కడ విషయం ఏమిటంటే తెలంగాణాలో బీజేపీ గెలుపుకు టీడీపీ సహకరించాలని అనుకున్నది. తన ఓట్లన్నింటినీ బీజేపీకి వేయించేట్లుగా కమలనాదులతో మంతనాలు కూడా ఇండైరెక్టుగా చేసింది. చంద్రబాబునాయుడు అసలు ప్లాన్ ఏమిటంటే తెలంగాణాలో సహకరిస్తామని చెప్పి ఏపీలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవటమే. తెలంగాణాలో టీడీపీకి ఎన్ని ఓట్లున్నాయో ఎవరికీ తెలీదు. అలాగే బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే ప్రచారం ఎంత వాస్తవమో తెలీదు.





ఈ నేపధ్యంలోనే తెలంగాణాలో తమ ఓట్లన్నింటినీ బీజేపీకి వేయించాలంటే పొత్తు పెట్టుకోవాలని పదే పదే సంకేతాలు పంపింది. అయితే బీజేపీ నుండి ఎలాంటి రెస్పాన్స్ కనబడలేదు. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి మరోవైపు ఏపీలో బీజేపీ చాలా తీవ్రంగా టీడీపీని వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సమయంలో ఇంకా పొత్తుకోసం ఉపేక్షించి లాభంలేదని అర్ధమైనట్లుంది. అందుకనే పాలిట్ బ్యూరో సమావేశంలో ఒంటరిగా పోటీచేయాలని తీర్మానం చేసేసింది. అవసరమైతే తీర్మానాన్ని పక్కన పెట్టకూడదని  ఏమీలేదు.






ఇంటింటికి టీడీపీ, సభ్యత్వ నమోదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని, వీలైనన్ని స్ట్రీట్ మీటింగులు తదితరాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని చంద్రబాబు తమ్ముళ్ళని ఆదేశించారు. ఇకనుండి రెగ్యులర్ గా హైదరాబాద్ పార్టీ మీటింగులు పెట్టాలని, అభ్యర్ధుల ఎంపిక కూడా వీలైనంత తొందరగా పూర్తిచేసి ప్రకటించబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. తెలంగాణాలో ఒంటరిగా పోటీచేయబోతున్నది అంటే ఏపీలో కూడా బీజేపీతో పొత్తుండదనే దాదాపు అర్ధమవుతోంది. ఇక మిగిలింది జనసేన మాత్రమే. ఎంఎల్సీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఈ విషయంలో కూడా చంద్రబాబులో పునరాలోచన మొదలైందని ప్రచారం జరుగుతోంది. మరి చివరకు ఏమిచేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: