ఓటములు ఎదురైన వెనక్కి తగ్గకుండా పోరాడితే విజయం సాధించవచ్చని దివిసీమ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నిరూపించారు. కమ్యూనిస్ట్ నేతగా రాజకీయాలు మొదలు పెట్టిన సింహాద్రి, అవనిగడ్డ బరిలో రెండు సార్లు ఓటమి పాలై...మూడో సారి బంపర్ విక్టరీ కొట్టారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం తరుపున పోటీచేసిన రమేష్... ఆ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూశారు. అయితే పరాజయం వచ్చిన ఏ మాత్రం క్రుంగిపోకుండా నియోజకవర్గంలోనే పని చేశారు.

 

ఈ క్రమంలోనే తన కష్టానికి అండగా ఉంటుందని వైసీపీలోకి వచ్చి, 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగారు. అయితే 2014లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడంతో నియోజకవర్గంలోని కాపు ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారి మండలి బుద్ధప్రసాద్ స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఇక ఇక్కడ కూడా ఓటమి వచ్చిన రమేష్, వెనక్కి తగ్గలేదు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండే పోరాడారు. చివరికి ఆ పోరాటానికి ఫలితంగానే 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొందారు.

 

ఇక తొలిసారి ఎమ్మెల్యే అయిన సింహాద్రి..నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చే ప్రజలకు డైరెక్ట్‌గా తన ఇంటికే వచ్చే అవకాశం కల్పించారు. నియోజకవర్గంలోని ప్రధాన గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికి అందేలా చేశారు. కాకపోతే అవనిగడ్డలో ఈ 8 నెలల కాలంలో పెద్దగా అభివృద్ధి ఏం జరగలేదు. అలాగే ప్రతిపక్ష టీడీపీ విమర్శలకు చెక్ పెట్టడంలో కాస్త వెనుక ఉన్నారు. అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడిన సందర్భాలు కూడా లేవు.

 

కానీ రాష్ట్ర స్థాయిలో హైలైట్ కాకపోయిన...లోకల్‌గా సింహాద్రికి మంచి పట్టు ఉంది. నియోజకవర్గంలో సైలెంట్‌గా పనులు చేసుకోవడం వల్ల, రమేష్‌కు ఫాలోయింగ్ బాగా పెరిగింది. అన్నీ వర్గాలని కలుపుకుని వెళుతూ...దివిసీమపై పట్టు పెంచుకుంటున్నారు. అయితే భవిష్యత్‌లో దివిసీమని మరింత అభివృద్ధి చేసి, మరోసారి ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: