చంద్రబాబునాయుడుకు ప్రచారం ఎలా చేసుకోవాలో బాగా తెలుసు. విశాఖపట్నం విమనాశ్రయం దగ్గర జరిగిన గొడవే ఇందుకు తాజా ఉదాహరణ. విశాఖపట్నంను ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ గా చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా  జనాలను రెచ్చగొట్టటానికి ప్రయత్నించి ఫెయిలయ్యారు. ఈ నేపధ్యంలోనే ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు. రెండు రోజుల పర్యటనలో ఒకరోజు విశాఖపట్నం, రెండో రోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తారన్న విషయం అందరికీ తెలుసు.

 

ఎప్పుడైతే చంద్రబాబు ప్రోగ్రామ్ ఫైనల్ అయ్యిందో  మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యానారాయణ చంద్రబాబును అడ్డుకోవాలంటూ పిలుపిచ్చారు. దాంతో చంద్రబాబు విశాఖపట్నం వస్తే గొడవ అవ్వటం ఖాయమని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. ఇక్కడే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తెలివి బయటపడింది. తాను విశాఖపట్నంకు వెళితే గొడవ జరుగుతుందని తెలిసీ కావాలనే వచ్చాడు.          

 

చంద్రబాబు అనుకున్నట్లుగానే వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎయిర్ పోర్టు బయట వందలాది కార్యకర్తలు చంద్రబాబును అడ్డుకున్నారు. దాంతో దాదాపు ఐదు గంటల పాటు ఎయిర్ పోర్టు మైన్ ఎంట్రన్స్ ముందు పెద్ద గందరగోళం జరిగింది. చివరకు పోలీసులు బలవంతంగా చంద్రబాబు మళ్ళీ విమానాశ్రయం లోపలకు తీసుకెళ్ళి విమానం ఎక్కించేశారు. చంద్రబాబుకు కావాల్సింది సరిగ్గా ఇదే.

 

విమానాశ్రయం దగ్గర ఇటువంటి హై డ్రామా జరుగుతుందని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే పెద్ద డ్రామా ప్లే చేసి దాదాపు ఐదుగంటల పాటు విపరీతమైన ప్రచారం చేయించుకున్నారు. దాదాపు అన్నీ ఛానళ్ళూ ఏకధాటిగా గంటలకొద్ది చంద్రబాబుపైనే ఫోకస్ చేశాయంటేనే ఏ స్ధాయిలో ప్రచారం తెచ్చుకున్నారో అర్ధమైపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే చంద్రబాబుకు మానవహక్కులు, మీడియా స్వేచ్చ అన్నీ గుర్తుకు వస్తాయి. అదే అధికారంలో ఉంటే మాత్రం ఏవీ గుర్తుండవు. మొత్తానికి చంద్రబాబు ప్లాన్ బాగానే వర్కవుటైందనే చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: