ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమై ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని దృఢ నిశ్చయంతో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల విజయానికి కావాల్సినన్ని ఎత్తుగడలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ  స్థానిక సమరంలో గెలుపు కోసం అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ విషయంలో జగన్ గట్టిగానే క్లాస్ పీకారు. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాబోతున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచనలు చేశారు. టిడిపి కూడా ఈ  ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం వల్ల  వైసీపీకి ప్రజల్లో ఆదరణ లేదు అనే విషయాన్ని రుజువు చేయాలని చూస్తోంది. 

IHG


కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపించడం లేదు. అసలు ఆ పార్టీలో ఎన్నికల వాతావరణం కూడా కనిపించడం లేదు. తాత్కాలికంగా రాజకీయాలకు పులిస్టాప్ పెట్టి సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. కుటుంబ పోషణ కోసం పార్టీని నడపాలంటే డబ్బులు కావాల్సి రావడంతో తనకు ఈ  పరిస్థితి వచ్చిందని పదేపదే చెబుతున్నారు. అలా చెప్పినట్టుగానే ఇప్పుడు సినిమా షూటింగులకు హాజరవుతున్నారు.

IHG


 వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో అధికారం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్న పవన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను రంగంలోకి దించుతారా లేదా అనే విషయంలో జనసేన పార్టీ పై అనుమానాలు పెరిగిపోతున్నాయి. మార్చి 21వ తేదీన జెడ్పిటీసీ, ఎంపిటిసి ఎన్నికలు, మార్చి 24న మున్సిపల్ ఎన్నికలు, మార్చి 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ వాటిని పట్టించుకునే తీరిక ఇప్పుడు పవన్ కు లేదు. పూర్తిగా సినిమాలపైనే పవన్ ఫోకస్ అంతా ఉంది. దీంతో జనసేన కార్యకర్తల్లోనూ అయోమయం నెలకొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: