టీవీ9 ను ఇటీవల గమనించారా.. టీవీ9 లోగోలో కొత్తగా తెలుగు అని చేరింది.. గుర్తించారా.. టీవీ9 కాస్తా.. ఇప్పుడు టీవీ9 తెలుగు అయ్యింది. మరి ఈ మార్పు ఎందుకో ఊహించారా.. అసలు టీవీ9 అంటేనే తెలుగు ఛానల్ మళ్లీ తెలుగు అని చెప్పుకోవడం ఎందుకు అని అనిపించింది కదా..

 

 

అసలు విషయం ఏంటంటే.. టీవీ9 లోగో పై గతంలో కూడా వివాదం ఉంది. టీవీ9 కు సంబంధించిన లోగో పై పేటెంట్ హక్కులు.. ఈ సంస్థ వ్యవస్థాపక యజమాని శ్రీని రాజుకు కాకుండా దాని వ్యవస్థాపక ఎడిటర్ రవి ప్రకాశ్ పేరుతో ఉన్నాయని గతంలోనే వెల్లడైంది. రవి ప్రకాశ్ ఈ సంస్థ నుంచి వెళ్లే కొద్ది రోజుల ముందు.. మరో ఛానల్ అయిన మోజో టీవీ యాజమాన్యానికి ఈ లోగో రైట్స్ అమ్ముకున్నారు.. ఈ విషయంపై కొత్త యాజమాన్యం రవి ప్రకాశ్ పై కేసు కూడా పెట్టింది.

 

 

ఈ కేసు వివాదం కోర్టుల్లో ఉండగానే ఇప్పుడు టీవీ9 కొత్త యాజమాన్యం అనూహ్యంగా ఛానల్ పేరులో కొత్తగా తెలుగు చేర్చింది. దీంతో ఇప్పుడు మీడియా వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అంటే టీవీ9 లోగో రైట్స్ రవి ప్రకాశ్ వద్దే ఉన్నాయా.. ఆ కేసు రవిప్రకాశే గెలిచారా.. టెక్నికల్ గా ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకే టీవీ లోగోను టీవీ9 తెలుగు గా మార్చారా.. అన్న చర్చ సాగుతోంది.

 

 

అదే నిజమైతే.. టీవీ9 కొత్త యాజమాన్యంపై రవి ప్రకాశ్ విజయం సాధించినట్టే చెప్పుకోవాలి..ఒక వేళ లోగో కేసు రవిప్రకాశ్ గెలిస్తే.. మరి ఆయన టీవీ9 పేరుతోనే కొత్త ఛానల్ పెడతారా అన్న చర్చ కూడా ఉంది. రవిప్రకాశ్ ఇప్పటికే ఛానల్ ప్రారభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే రవి ప్రకాశ్ కొత్త ఛానల్ రాబోతోంది. ఆ మధ్య వేరే పేరుతో లోగో కూడా బయటకు వచ్చింది. మరి ఇప్పుడు రవిప్రకాశ్ కొత్త ఛానల్ పేరు టీవీ9 ఉంటుందా.. చూడాలి ఏంజరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: