ఎక్కడైతే చర్య ఉంటుందో అక్కడ ప్రతిచర్య ఉంటుంది అన్నది ఎప్పటినుంచో వస్తున్న నానుడి . ప్రతి విషయంలో ఇలాంటిది  తప్పక జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ కేసులు పెరుగుతున్న వేళ మినహాయింపులు తాజాగా  ఎక్కువగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. భవన నిర్మాణాలకు ఎలక్ట్రికల్ వర్కర్స్ కి రోడ్ల నిర్మాణాలు  లాంటి తదితర వాటికి కూడా మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీనిపై అటు ఎంతో మంది కార్మికులకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. నిన్నటి వరకు వైరస్ ప్రభావం  తక్కువగా ఉన్న సమయంలో లాక్ డౌన్ తో కట్టడి చేసి  అందరిని ఇంట్లోనే ఉంచారు.  ఇప్పుడు వైరస్ పెరుగుతున్న సమయంలో ఈ మినహాయింపు ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది. 

 

 అయితే కేంద్ర ప్రభుత్వం ఈ  మినహాయింపు ఇవ్వడం వెనుక మతలబు వేరే ఉండి ఉంటుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మే 3వ తేదీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్  ముగిసిపోతుంది అనే విషయం తెలిసిందే. అయితే కేవలం మే 3వ తేదీ కి  మాత్రమే లాక్ డౌన్  ఎత్తి వేయకుండా ఆ తర్వాత జూన్ వరకు లాక్ డౌన్ కోనసాగించే అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డాన్ కారణంగా దేశంలో ఏకంగా 20 లక్షల కోట్ల వరకు సంపద ఆవిరైపోయింది. మళ్లీ పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధిస్తే దేశం సర్వం కోల్పోవాల్సి ఉంటుంది. 

 

 అయితే దీనిపై సంచలన ఆలోచన చేసిన కేంద్రం.. దేశంలోని అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్,  ఆరెంజ్ జోన్,  రెడ్ జోన్లుగా విభజించి లాక్ డౌన్  కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు కేవలం  గ్రీన్ జోన్ లో మాత్రమే ఉండేలా.. అంటే కరోనా  వైరస్ ప్రభావం అతి తక్కువగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఆ మినహాయింపులు అన్నీ ఉండేలా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. గ్రీన్ జోన్ లో 70శాతం ఫెసిలిటీస్ అందుబాటులోకి తేనుంది. ఆరెంజ్ జోన్ లో  కొన్ని నిబంధనలతో కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆరెంజ్ జోన్ లో  50 శాతం వరకు ఫెసిలిటీస్ కల్పించనున్నారు. ఇక రెడ్ జోన్  విషయానికి వస్తే మాత్రం పూర్తిస్థాయిలో అంటే వందకి 100% లాక్  డౌన్ కొనసాగడమే కాదు  మరింత కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: