ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ మందికి ఎంటర్టైన్మెంట్  అందిస్తున్న యాప్  టిక్  టాక్ . ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేస్తుంది ఈ యాప్ . ఇక టిక్  టాక్  ద్వారా సరికొత్త ఎంటర్టైన్మెంట్ నెటిజన్లకు అందుతుండటంతో అందరూ  మరింత ఆసక్తిని చూపుతున్నారు. దీంతో తక్కువ సమయంలో టాప్ ప్లేస్  లోకి దూసుకొచ్చింది టిక్  టాక్. ప్రస్తుతం ఉన్న అన్ని ఎంటర్టైన్మెంట్ యాప్ లను వెనక్కి నెట్టి టిక్ టాక్  దూసుసుకుపోతుంది. ఇక అసలు  టిక్ టాక్ కి అసలు తిరుగులేదు అని నిరూపించింది. అంతే కాదు ఇది ఎంతో మందిని ప్రభావితం చేసి వారిలో ని టాలెంట్ ని కూడా బయటకు తీసింది. 

 

 

 

 

 ఇక్కడి టిక్  టాక్  కారణంగా కొన్ని అనర్థాలు కూడా జరిగాయి అనుకోండి. ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు... అంతేకాకుండా ఈ టిక్  టాక్  ఎంతోమంది కాపురాల్లో చిచ్చు పెట్టింది కూడా. అయితే మొన్నటి వరకు భారత దేశంలో టాప్ రేటింగ్ తో  దూసుకుపోయిన టిక్ టాక్ యాప్  ప్రస్తుతం క్రమక్రమంగా పడిపోతుంది. దాదాపు ఈ యాప్ భారతదేశంలో ఢమాల్  అయిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం నెటిజన్లు అందరూ టిక్ టాక్ నెగిటివ్ రేటింగ్ ఇస్తున్నారు. దీంతో ఏకంగా 4.7 రేటింగ్ నుండి  టిక్  టాక్  ప్రస్తుతం 2 కంటే తక్కువకు పడిపోయింది. 

 

 

 

 

 అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్యాన్  టిక్ టాక్ ఇండియా అనే ఒక హ్యాష్ట్యాగ్  కూడా ట్రెండింగ్ గా మారిపోయింది. అయితే అసలు ఈ వివాదం ఎక్కడ ప్రారంభమైంది టిక్టాక్ ఇంత దుస్థితి రావడానికి కారణం ఏంటి అన్నది ఆరా తీస్తే..  ఫైజల్ సిద్ధికి  అనే టిక్ టాకర్  యాసిడ్ దాడి ప్రతిబింబించేలా టిక్ టాక్ లో వీడియో చేసి అప్లోడ్ చేశాడు. ఇక ఈ వీడియో కాస్త వివాదాస్పదంగా మారి పోయింది. అంతేకాకుండా టిక్ టాక్ చైనా కు సంబంధించిన అనే కారణాలు కూడా ఈ యాప్ను భారతీయులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడానికి కారణం అవుతుంది అనే వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా టిక్ టాక్ కి భారతదేశంలో టిక్ టాక్ కి  కాలం చెల్లిపోయింది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: