రెండు తెలుగు రాష్ట్రాలని వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు పేద ప్రజలకు నానా ఇబ్బందులు వచ్చాయి. పలు చోట్లా ఇల్లు కూలిపోతే, కొన్నిచోట్ల ప్రాణ నష్టం జరిగింది. ఇక ముఖ్యంగా పంటలు మాత్రం బాగా దెబ్బతిన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల సీఎంలు రైతులని ఆదుకునే దిశగా ఆదేశాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఓ వైపు రాష్ట్రంలో ఇతర సమస్యలకు చెక్ పెడుతూనే, వరద వల్ల నష్టపోయిన కుటుంబాలని, రైతులని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్న కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలో జగన్ ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. సీఎం కాబట్టి డైరక్ట్‌గా ఫీల్డ్‌లోకి దిగితే పేదలకు సాయం లేటుగా అందుతుంది. ఇప్పటికే మంత్రులు ఫీల్డ్‌లో ఉండి పరిస్థితులని ఎప్పటికప్పుడు జగన్‌కు తెలియజేస్తున్నారు. కానీ టీడీపీ నేతలు జగన్‌పైనే విమర్శలు చేస్తూ, వరదలో బురద రాజకీయం చేస్తున్నారు. జగన్ అసలు ప్రజల గురించి పట్టించుకోవడం లేదని, జనాల్లోకి రావడం లేదని, అదే మా చినబాబు(లోకేష్) అయితే బురదలోనే ఉంటున్నారని విమర్శలు చేస్తున్నారు.

గత కొంతకాలంగా చంద్రబాబు, చినబాబులు ఏపీని వదిలి హైదరాబాద్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక ఇన్నిరోజుల తర్వాత చినబాబు ఏపీకి వచ్చి హడావిడి చేసేస్తున్నారు. పొలాల్లో దిగేసి పంట పొలాలని పరిశీలిస్తున్నట్లు హల్చల్ చేస్తుంటే, రైతులని ఓదారుస్తున్నట్లు టీడీపీ అనుకూల మీడియా కవర్ చేస్తుంది. అయితే పంట పొలాల్లోకి వెళితే ఫోటోగ్రాఫర్‌లని కూడా వెనకే తీసుకెళుతున్నట్లు తెలుస్తోంది. అయినా లోకేష్ ఏ పంట ఏంటో తెలుసా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక ఈ విధంగా లోకేష్ జనాల్లో తిరుగుతూ రీల్ వేస్తుంటే, జగన్ రియాలిటీగా జనానికి సాయం అందిస్తున్నారు. అయినా జనంలో మదిలో ఉన్న జగన్‌ని చినబాబు ఓదార్పు యాత్రలు తీయలేవని వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: