చినబాబు...చంద్రబాబు తరువాత టీడీపీకి వారసుడు.  అధినాయకుడి ఆశా దీపం. కరోనా వేళ ఆరేడు నెలల పాటు ఇద్దరు బాబులూ హైదరాబాద్ వదిలిపెట్టి రాలేదు అన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపించాయి. దాంతో లోకేష్ రంగంలోకి దిగారు. వరద బాధితుల పరామర్శ అంటూ ఆయన జనంలో తిరుగుతున్నారు.  తనకు తోచిన రీతిన విమర్శలు కూడా వైసీపీ సర్కార్ మీద చేస్తున్నాడు.

చిత్రమేంటంటే చినబాబు ఏపీలో టూర్ చేస్తున్నా కూడా  ప్రభావం ఏదీ రాజకీయాల్లో కనిపించకపోవడం. చినబాబు వస్తున్నారు అంటే టీడీపీ తమ్ముళ్ళే సగానికి సగం మంది డుమ్మా కొడుతున్నారు. అనంతపురం టూర్ కి వెళ్తే అక్కడ పరిటాల వర్గంతో పాటు బడా నాయకులు దూరంగా ఉన్నారు. ఇక గోదావరి జిల్లాలకు వస్తే అక్కడ కూడా  పెద్ద తలకాయలు  అలాగే చేశాయి.

ఇక సొంత పార్టీకి జోష్ తెప్పిద్దామని చినబాబు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడికి అక్కడ అలా బెడిసికొడుతూంటే మరో వైపు ఆయన చేస్తున్న విమర్శలు కూడా వైసీపీ మంత్రుల ధాటికి కొట్టుకుపోతున్నాయి. దీనికంతంటికీ కారణం మూడు సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేయడమే. లోకేష్ ఏ విమర్శ చేసినా దాన్ని చంద్రబాబు పాలనతో ముడిపెట్టి మంత్రులు తిప్పికొడుతున్నారు.

రైతుల గురించి లోకేష్ మాట్లాడడం ఏంటి అని మంత్రి కొడాలి నాని, అంటే ఆయన ఒక పప్పు, ఆయనకు కూడా మేము జవాబు చెప్పాలా అంటూ  మరో మంత్రి అనిల్ కుమార్ వెటకారం ఆడుతున్నారు. మొత్తానికి లోకేష్ బిగ్ ఫిగర్ గా టీడీపీకి ఆనడం లేదు, విపక్షం అసలు పట్టించుకోవడంలేదు. మరో వైపు చూస్తే  ఏపీ టీడీపీకి ఎలాగైనా  కదలిక తీసుకురావాలని బాబు తన కుమారుడిని పంపించారు కానీ ఆ దిశగా ఏమీ పని జరుగుతున్నట్లుగా లేదు.

రాజకీయాల్లో ప్రామ్టింగ్ అసలు  ఉండదు, అలవోకగా మాట్లాడడం ఒక కళ. ఇక జనాన్ని ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడం మరో కళ, విపక్షాలను కార్నర్ చేసేలా పంచులు వేయడమూ ఒక ఆర్ట్. కానీ చినబాబు మాత్రం ఇవేమీ పెద్దగా లేకుండానే బరిలోకి దిగిపోవడంతో అడ్డంగా బుక్ అయిపోతున్నారు అంటున్నారు. అయినా మేము పెదబాబుకే జవాబు చెప్పం, చినబాబు ఒక లెక్కా అని అధికార పార్టీ అంటోంది అంటే లోకేష్ మరింతగా రాటుదేలలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: