న్నటి వరకు రాజకీయంగాను, వ్యక్తిగతంగాను అనంతపురం జిల్లాకు చెందిన కీలక నాయకుడు జెసి ఫ్యామిలీ ఎన్ని రకాల ఇబ్బందులకు గురయ్యారో అందరికీ తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ జెసి ఫ్యామిలీ
జగన్ ను ఓ రేంజ్ లో ఇట్టి పోస్తూనే వచ్చారు.
జగన్ తల్లి విజయమ్మను సైతం వదిలి పెట్టకుండా తిట్టిపోశారు. అయితే ఆ సమయంలో
జగన్ సైలెంట్ గానే ఉన్నారు. కానీ, ఏపీలో
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ,జగన్ తన రాజకీయ ప్రత్యర్దులందరినీ కి చుక్కలు చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టకుండా, గతంలో చేసిన తప్పులన్నిటినీ ఇప్పుడు బయట పెడుతూ పైన కేసులు నమోద చేస్తున్నారు.
ఆ విధంగానే జేసీ
ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్
రెడ్డి జైలు పాలయ్యే విధంగా చేశారు . ప్రస్తుతం బెయిల్ బయటకు వచ్చారు. ఇక ఇటీవల
టిడిపి ప్రకటించిన కమిటీలలోనూ జెసి ఫ్యామిలీ కి
టిడిపి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో చంద్రబాబు జేసీ ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఇక జెసి ఫ్యామిలీ
బీజేపీ లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదని భావించడం, తాజాగా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ అనంతపురం
జిల్లా పర్యటనలో జెసి ఫ్యామిలీ కి ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చినట్టుగా అనిపిస్తున్నాడు దీంతో
టిడిపి లోని జెసి ఫ్యామిలీ వ్యతిరేకులకు ఈ వ్యవహారం
మౌనిక పుట్టిందట
దీనికి తగ్గట్టుగానే
లోకేష్ తన పర్యటన మొదలయినప్పటి నుంచి ముగిసేవరకు
జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు
పవన్ రెడ్డిని పక్కన పెట్టుకోవడం,
పవన్ రెడ్డి కనుసన్నల్లోనే
లోకేష్ పర్యటన సాగడం వంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు సీనియర్లు చర్చించుకుంటున్నారు.
జెసి దివాకర్
రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న సమయంలో
టిడిపి లోని ఎంతోమంది ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు అటువంటి నాయకులకు
టిడిపి ప్రాధాన్యం ఇచ్చి, మిగతా పార్టీలోని సీనియర్ లను పట్టించుకోకపోవడం ఏంటంటూ
జిల్లా నాయకులు గుర్రుగా ఉన్నారు.ఈ అసంతృప్తి ఎక్కడ వరకు దారితీస్తుందో తెలియదు అయితే జేసీ ఫ్యామిలీ కనుక
బీజేపీ వైపు వెళ్తే అనంతపురం జిల్లాలో రాజకీయంగా ఎదురుదెబ్బ తినాల్సివస్తుందనే భయం ఉంది దీనికితోడు మిగతా నాయకుల్లో భయాందోళనలు పెరిగిపోతాయనే భయంతో
టిడిపి ఇప్పుడు ఫ్యామిలీకి ప్రాధాన్యం పెంచినట్టు గా కనిపిస్తోంది