సంఖ్యా పరంగా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు వైసిపి తో పోలిస్తే తక్కువ మంది ఉన్నా, గట్టిగానే హడావుడి చేస్తున్నారు. అసెంబ్లీలోనూ బయట టిడిపి ఎమ్మెల్యేలు కొందరు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు సైతం అదేపనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అసెంబ్లీలోనూ ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. కానీ వైసీపీ నుంచి ఆ విమర్శలను తిప్పి కొట్టే విషయంలో జగన్ నియమించుకున్న మంత్రులు పెద్దగా స్పందించకపోవడం, మంత్రివర్గంలో ఉన్న చాలామంది రాజకీయాలకు కొత్త కావడం, పెద్దగా రాజకీయ వ్యూహాలు అల్లడంలో అనుభవం లేకపోవడ వంటి వ్యవహారాలతో వెనుకబడి ఉన్నారు. అయితే జగన్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అండగా ఉంటూ వస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీపై విమర్శలను తిప్పి కొడుతూ టిడిపిని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.
అసెంబ్లీలోనూ వివిధ అంశాలపై ఎమ్మెల్యేలు మాట్లాడినంత స్థాయిలో మంత్రులు మాట్లాడలేక నీళ్లు నములుతున్న పరిస్థితులు అనేకం చూశాము. దీంతో మంత్రులు కంటే ఎమ్మెల్యేల కారణంగా ప్రభుత్వ అబాసుపాలు కాకుండా వస్తుంది అనే అభిప్రాయం
జగన్ లో సైతం ఉంది.
జగన్ మంత్రులుగా ఎంపిక చేసిన వారిని సామాజిక వర్గాల కు అనుగుణంగా నియమించారు. దీనికోసం మొదటి నుంచి తనకు అండగా ఉంటూ వచ్చిన వారిని సైతం పక్కనపెట్టి మరి
మంత్రి పదవులు ఇచ్చారు. అయినా
కొడాలి నాని, కన్నబాబు మరో ఇద్దరు ముగ్గురు మంత్రులు తప్ప మిగతా వారు
టిడిపి విమర్శలను తిప్పి కొట్ట లేకపోవడం
వైసిపి కి ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద రావు, అంబటి రాంబాబు, ఆర్.కె.రోజా వంటి వారు కొంతమంది
టిడిపి విమర్శలను తిప్పి కొట్టడమే కాకుండా
వైసీపీ ప్రభుత్వానికి , పార్టీకి మేలు జరిగే విధంగా చేయడంలో
సక్సెస్ అవుతున్నారు.
కానీ మంత్రులలో చాలామంది తమకు సంబంధించిన శాఖలపై పట్టు సాధించలేకపోవడం, ఆ శాఖలకు సంబంధించిన విషయాలను మాట్లాడలేకపోవడం , ఈ కారణంగా
వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో
జగన్ నియమించుకున్న మంత్రులు చాలామంది వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోవడం , అదే సమయంలో జగ న్
మంత్రి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టిన ఎమ్మెల్యేలు అండగా నిలబడుతూ ఉండడం వంటి వ్యవహారాలపై ఇప్పుడు
జగన్ కూడా లోతుగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.