ఇక ఎన్నికలకు ముందు పాదయాత్ర పెట్టిన జగన్ ఈ ప్రాంతంలోనూ పర్యటించడంతో వారి సమస్యలను కళ్లారా చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే మీ బాధలు తీరుస్తాను అంటూ హామీ ఇవ్వడంతో పాటు, అధికారంలోకి రాగానే ఆ సమస్యలపై దృష్టి పెట్టారు. దీంతో 750 కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ పథకాన్ని ఈ ప్రాంతానికి మంజూరు చేశారు. దీనికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేయడంతో ఉద్దానం ప్రాంత వాసుల్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది.
ఇప్పటి వరకు భూగర్భ జలాలు తాగుతూ, కిడ్నీ వ్యాధులకు గురైన ప్రజలు ఇకపై హిరా మండలంలోని, గొట్ట బ్యారేజ్ నుంచి నీటిని తీసుకొచ్చి వాటర్ గ్రిడ్ కు అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించే భారీ ప్రాజెక్టును ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ప్రజలకు సురక్షితమైన తాగునీరు దీని ద్వారా అందుతుంది. ఇప్పటి వరకు తప్పనిసరి పరిస్థితుల్లో తాగేందుకు అనువుకాని భూగర్భజలాలను అక్కడ ప్రాంతవాసులు తాగుతూ, కిడ్నీ వ్యాధులకు గురయ్యారు. ఇప్పుడు జగన్ నిర్ణయంతో సురక్షితమైన తాగునీరు రావడంతో పాటు, ఇకపై కిడ్నీ సమస్యలకు చెక్ పడినట్లే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి