బ్రిటన్ నుంచి కడప జిల్లాకు ఈ మధ్యకాలంలో 24 మంది వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో పది మందిని గుర్తించగా ఇంకా 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అలాగే శంషాబాద్ ఎయిర్ పోర్ట్, గన్నవరం ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమై, విదేశాల నుంచి వస్తున్న వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. వారం రోజులు బ్రిటన్ నుంచి 3 వేల మంది తెలంగాణకు వచ్చారు. వారికి పరీక్షలు అధికారులు నిర్వహిస్తున్నారు.యూకే నుంచి వచ్చిన వారు ప్రభుత్వానికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
ఇప్పటికే ఇద్దరిలో కరోనా లక్షణాలు బయట పడగా, వారి వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను పంపించారు.అలాగే డిసెంబర్ 9 తరువాత బ్రిటన్ నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని, బయటకు రావొద్దని ఆదేశాల సైతం అధికారులు జారీ చేశారు. అలాగే ఇటీవల బ్రిటన్ నుంచి కరీంనగర్ జిల్లాకు 16 మంది వచ్చారనే సమాచారం అధికారులను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే పది మంది శాంపిల్స్ వైద్య అధికారులు సేకరించారు. మిగతా ఆరుగురు సమాచారం తెలియకపోవడంతో అధికారులలోనూ టెన్షన్ మొదలైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి