ఒకే ఒక్కడు నాడు జగన్‌ను కాదని
వైసీపీ నుంచి బయటకు వెళ్లి తన సత్తా చాటారు. జగన్ గత ఎన్నికల్లో మహామహులు అయిన ఎంతో మంది నేతలుక
చెక్ పెట్టినా ఆ నేతను మాత్రం ఏమీ చేయలేకపోయారు. ఇక
పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా జగన్ ఎన్నో నియోజకవర్గాలపై ప్రత్యేకంగా కాన్ సంట్రేషన్ చేసి ఎంతో మంది
టీడీపీ వాళ్లకు సులువుగానే
చెక్ పెడుతోన్న పరిస్థితి. అయితే ఆ ఒక్క నేతకు మాత్రం జగన్ ఎన్ని చెక్‌లు పెడుతున్నా ఏ మాత్రం నెరవకుండ పోరాటం చేస్తున్నాడు. ఆ నేత ఎవరో కాదు ప్రకాశం
జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.

కాంగ్రెస్,
వైసీపీ,
టీడీపీ పార్టీల నుంచి మార్టూరు, అద్దంకిలో ఓటమి లేకుండా వరుసగా నాలుగు సార్లూ గెలుస్తూ వస్తోన్న చరిత్ర రవికుమార్‌ది. ఇక గత ప్రభుత్వంలో
వైసీపీ నుంచి గెలిచి
పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో
టీడీపీ నుంచి పోటీ చేసి అందరూ చిత్తుగా ఓడిపోతే ఒక్క
గొట్టిపాటి రవికుమార్ మాత్రమే అద్దంకిలో విజయం సాధించారు. రవికుమార్ స్పెషల్ ఇమేజ్ అది. ఇక పంచాయతీ ఎన్నికల ముందు వరకు స్లోగా ఉన్న రవి ఇప్పుడు దూకుడు పెంచారు. పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీకే ఎక్కువ పంచాయతీలు వచ్చినా రవికుమార్
టీడీపీ పరువు కూడా నిలిపారు.

ఇక ఇప్పుడు
అద్దంకి నగర పంచాయతీపై
టీడీపీ జెండా ఎగరేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. నిత్యం నియోజకవర్గ కేంద్రమైన అద్దంకిలో పర్యటిస్తున్నారు. ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే 20 వార్డుల
పార్టీ అభ్యర్థులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల్లో గెలుపకోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు ఈ సారి అయినా
అద్దంకి మున్సిపాల్టీలో పార్టీని గెలిపించకపోతే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని
వైసీపీ ఇన్‌చార్జ్ బాచిన
కృష్ణ చైతన్య చెమటోడుస్తున్నారు. ఏదేమైనా అద్దంకిలో రవి జోరుకు
వైసీపీ ఎంత వరకు బ్రేక్ వేస్తుందో ? చూడాలి.