దేశంలో కరోనా ఉధృతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏమాత్రం కని కరం చూపించట్లేదు. అనేక మంది ప్రాణాలని బలి తీసుకుంటుంది. ఇక రోజు రోజుకి చాప కింద నీరు లాగా కరోనా దేశం నలుమూలాల వ్యాప్తి చెందుతుంది.అలాగే మరణాలు కూడా చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఒక వైపు కరోనా కేసులతో పాటు మరో వైపు ఆక్సిజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది.చాలా హాస్పిటల్ లో ఆక్సిజన్ లేక ప్రజలు ఊరకనే తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కరోనాని అదుపు చెయ్యలేక అటు ప్రభుత్వంతో పాటు ఇటు డాక్టర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.


ఇక మన సముద్రం తీర రాష్ట్రం గోవాలో విషాద ఘటన చోటు చేసుకుంది.సోమవారం నాటికి 1,21,650 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు 1729 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రి అయిన గోవా మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ ఆసుపత్రిలో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 26 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం 2 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజీత్‌ రాణే తెలిపారు. అయితే, ఘటనకు గల కారణాలపై స్పష్టత లేదన్నారు.ఘటన నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఆసుపత్రికి వెళ్లారు. ''మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత, కరోనా వార్డుల్లోకి సరఫరా మధ్య జరిగిన ఆలస్యం కారణంగా రోగులకు సమస్యలు ఎదురై ఉండొచ్చు'' అని ప్రమోద్ అన్నారు.రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కొన్ని సార్లు సిలిండర్లు సమయానికి చేరుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరాకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాబట్టి కరోనా సోకక ముందే జాగ్రత్తలు పాటించండి. మాస్కులు ధరించండి. మీ ప్రాణాలను కాపాడుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: