ఏపీ రాజకీయాల్లో యువ నాయకులకు ఏ మాత్రం కొదవ లేదు. అటు అధికార వైసీపీలో, ఇటు ప్రతిపక్ష టీడీపీలో యువ నేతలుగా ఎక్కువగానే ఉన్నారు. అయితే యువనేతలు ఎంతమంది ఉన్నా సరే మంచి క్రేజ్ ఉన్న నాయకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే రాజకీయాల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాయకుల్లో siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒకరు.


కర్నూలు జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న ఈ యువ నాయకుడుకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ఏదొక నియోజకవర్గంలో వైసీపీ యూత్ కట్టే బ్యానర్లలో ఖచ్చితంగా బైరెడ్డి బొమ్మ ఉంటుంది. అంటే బైరెడ్డి ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అండగా రాజకీయాల్లోకి వచ్చిన సిద్ధార్థ్ తక్కువ సమయంలోనే నాయకుడుగా ఎదిగారు.


ఇక తన పెదనాన్నతో విభేదించి వైసీపీలోకి వచ్చిన సిద్ధార్థ్, తన పవర్‌ఫుల్ స్పీచ్‌లతో, పదునైన డైలాగులతో వైసీపీ కేడర్‌ని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఉన్న యువ కార్యకర్తలు బైరెడ్డికి ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఇలా అతి తక్కువ కాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్‌కు జగన్ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలనీ సక్రమంగా నిర్వర్తించి గత ఎన్నికల్లో అక్కడ ఆర్థర్‌ ఎమ్మెల్యేగా గెలవడంలో కృషి చేశారు.


అయితే ఎన్నికల తర్వాత నందికొట్కూరులో బైరెడ్డి, ఆర్థర్ వర్గాలకు పెద్దగా పడటం లేదనే విషయం తెలిసిందే. ఇక ఆ విషయాన్ని పక్కనబెడితే బైరెడ్డికి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది. కాకపోతే బైరెడ్డి విషయంలో జగన్ మనసులో ఏముందో ఎవరికి తెలియదు. అలా అని కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గం ఖాళీగా లేదు. అన్నీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.


ఇక నందికొట్కూరు వచ్చి ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పోటీ చేయడానికి ఛాన్స్ లేదు. కాకపోతే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బైరెడ్డికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ అంశం ఇప్పటిలో తేలేలా కాదు.  మరి ఈ పరిస్తితిని చూసినప్పుడు నెక్స్ట్ బైరెడ్డికి పోటీ చేసే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు. మరి చూడాలి బైరెడ్డి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి: