అయినప్పటికీ.. కేడర్‌లో పట్టు సడలకుండా.. వ్యవహరించడం.. నవీన్‌ను నాయకుడిగా నిలబెట్టింది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి మద్దతుదారుగా మారారు. జగన్ పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపించే నవీన్.. పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. పట్టు వదలకుండా.. కొనసాగుతున్నారు. దీంతో జగన్ ఆయనకు 2014లో పోటీ చేసే అవకాశం కల్పించారు అయితే.. వరుసగా ఆయన మూడోసారి కూడా పరాజయం పాలయ్యారు. ఇక, గత ఎన్నికల సమయానికి నవీన్‌కు వ్యతిరేకంగా కొందరు కీలక నేతలు చక్రంతిప్పడంతో ఆయనకు టికెట్ మిస్సయింది.
దీంతో ఎన్నికలకు ముందు.. ఒకింత హల్‌చల్ చేసినా.. పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతుగా నిలచారు. ఇక, అప్పటి నుంచి కూడా పార్టీలో ఆయనకు గుర్తింపు లేదనే టాక్ వినిపించింది. హిందూపురం నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ.. ఎంపీ హవాతో ఆయన వాయిస్ ఎక్కడా వినిపించలేదు. ఈ సమయంలో తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో.. రాష్ట్రస్థాయి పదవి అయిన.. ఏపీ ఆగ్రోస్ డెవలప్‌మెంట్ చైర్మన్ పదవిని నవీన్‌కు ఇచ్చారు.
ఇది రాష్ట్రస్థాయిలో మంచి పోస్టేనని.. ముఖ్యంగా సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానమైన శాఖగా దీనికి పేరుంది. ఈ క్రమంలో నవీన్‌కు మంచి పదవి దక్కిందనే టాక్ వినిపిస్తోంది.దీనిపై నవీన్ హర్షం వ్యక్తం చేస్తూనే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్న టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్యను ఓడించడమే తన లక్ష్యమని అంటుండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి